బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, మలైకా అరోరా సుమారు నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం 12 ఏళ్ళు. అయినా కూడా ఈ జంట 2019 నుంచి డేటింగ్ లో ఉన్నారు.ఇక ఈ ప్రేమజంట పై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. కొడుకు వయసు ఉన్న హీరోతో ప్రేమాయణం ఏంటని మలైకాపై నెటిజెన్లు విమర్శలు చేశారు. అయినా కూడా ఈ జంట ఈ మాత్రం పట్టించుకోకుండా పబ్లిక్ గానే రెచ్చిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.


దీనిపై ఈ జంట అధికారికంగా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఇక మలైకా అరోరా ముంబైలోని ఓ ఐ క్లినిక్ ని సందర్శించింది. ఈ క్రమంలోనే ఆమె ఓ గ్రే కలర్ స్వేట్ షర్ట్ ని ధరించింది. ఆ స్వేట్ షర్ట్ పై 'Lets Fall Apart' అని రాసి ఉంది . అంటే తెలుగులో 'విడిపోదాం' అని అర్థం. మలైకా టీ షర్ట్ పై 'విడిపోదాం' అని ఉండడంతో అర్జున్ కపూర్ తో బ్రేకప్ విషయమై మలైకా ఇలా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.


మరోవైపు రీసెంట్ గా మలైకా తో విడిపోయిన అర్జున్ కపూర్ సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్ కుషా కపిలతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ కుషా కపిల ఆ వార్తలను ఖండించింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ.." నా గురించి ఇలాంటి చెత్త వార్తలు ప్రచారం చేసే వారిపై నాకు జాలి కలుగుతుంది" అంటూ ఒక్క మాటలో తేల్చేసింది.


కానీ ఇప్పుడు మలైకా అరోరా టీ షర్ట్ పై విడిపోదాం అని ఉండడంతో నిజంగానే అర్జున్ కపూర్ తో మలైకా విడిపోతుందని, అర్జున్ కపూర్ ఉషా కపిల తో రిలేషన్ లో ఉండడంతోనే మలైకా ఈ డెసిషన్ తీసుకుందని, దాన్ని అందరికీ ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఇలా పరోక్షంగా హింట్ ఇస్తుందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా కుషా కపిల రీసెంట్ గానే తన భర్త జోరవర్ అహ్లువాలియా నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది.


2017లో జోరావర్ అహ్లువాలియాను ఆమె పెళ్లి చేసుకుంది. ఇక మలైకా అరోరా రీసెంట్ గా తన నివాసంలో కరీనాకపూర్ పోస్ట్ చేసిన ఓ గెట్ టుగెదర్ కు హాజరైంది. ఈ గెట్ టుగెదర్ కు సంబంధించిన డిన్నర్ పార్టీకి ఆమె సోదరీ అమృత అరోరా, నిర్మాత కరణ్ జోహార్, నటాషా పూనావల్ల, మల్లికా భట్ తదితరులు అటెండ్ అయ్యారు. ఇక అర్జున్ కపూర్ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా సినిమాలపరంగా ఆడియన్స్ ని నిరాశ పరుస్తున్నాడు.


అర్జున్ కపూర్ నటించిన 'ఏక్ విలన్' రిటర్న్స్', 'కుత్తే' వంటి రీసెంట్ మూవీస్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఈ హీరో 'లేడీ కిల్లర్' అనే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. అజయ్ బల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.


Also Read : ‘స్కంద’ ప్రీ రిలీజ్ థండర్‌కు సర్వం సిద్ధం - ఛీఫ్ గెస్ట్ ఎవరంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial