బాలీవుడ్ అందాల భామలలో మలైకా అరోరా ఒకరు. పర్సనల్ లైఫ్ కావచ్చు లేదా ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు... ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. తన డ్యాన్స్, ఐటమ్ సాంగ్స్‌ వల్ల బాగా పాపులర్ అయ్యారు. అనేక రియాలిటీ షోలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల 'థామా' సినిమాలో ఒక ఐటమ్ నంబర్ చేశారు. అందులో నేషనల్ క్రష్ రష్మికా మందానాతో కలిసి ఆవిడ స్టెప్పులు వేశారు. 52 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్ చేయడం మీద ఆమెను ట్రోల్ చేశారు. ఇప్పుడు మలైకా అరోరా తనపై వచ్చిన ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చారు.

Continues below advertisement

ఇప్పుడు ఒక షోలో మలైకా అరోరా ట్రోల్స్ గురించి మాట్లాడారు. 'ది నమ్రతా జకారియా షో'లో ఆమె మాట్లాడుతూ... తన జీవితంలోని ఈ దశలో ఐటమ్ నంబర్ చేయడం ద్వారా తాను శక్తివంతంగా భావిస్తున్నానని చెప్పింది.

ట్రోల్స్‌కు గట్టిగా ఇచ్చి పడేసిన మలైక

Continues below advertisement

మలైకా అరోరా మాట్లాడుతూ... తన ఇమేజ్‌ను స్వీకరించడానికి తనకు ఎటువంటి సమస్య లేదని చెప్పారు. 'ఎందుకు చేయకూడదు? నేను దీనిని తగ్గించాల్సిన అవసరం లేదా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని విషయాల గురించి ట్రోల్ చేస్తారు. చాలా మంది వేర్వేరు విషయాలు చెబుతారు. ఇందులో ఇంత పెద్ద విషయం ఏంటో నాకు అర్థం కాదు. డ్యాన్స్‌ అనేది ఒక ఎమోషన్. నేను 50 ఏళ్ల వయసులో చేయగలుగుతున్నందుకు నిజంగా అదృష్టవంతురాలిని. నేను ఏదో ఒకటి సరిగ్గా చేశాను'' అని మలైకా అరోరా అన్నారు.

Also Read: Vijay Mallya: రెడ్డిగారి అమ్మాయి పెళ్లిలో లిక్కర్ కింగ్ కన్యాదానం... మాల్యా సీక్రెట్స్ రివీల్ చేసిన హీరోయిన్

ఇంకా మలైకా అరోరా మాట్లాడుతూ... ''ఇది చాలా చాలా శక్తివంతమైనది. ఇది నాకు చాలా బాగుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా బయట ఉన్న మహిళలు దీనిని ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఇది వారిని శక్తివంతం చేసేదిగా భావిస్తే, ఇది వారికి మంచి అనుభూతిని కలిగిస్తే... ఇది చాలా మంచి పని అవుతుంది'' అని అన్నారు.

Also ReadAnaganaga Oka Raju Box Office Collection Day 1: రాజుగారు అదరగొట్టారు...నవీన్ పోలిశెట్టి సినిమా ''అనగనగా ఒక రాజు' ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే?