Continues below advertisement

బాలీవుడ్ పెళ్లిళ్లు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. అది సింపుల్ గా జరిగినా లేదా గ్రాండ్ గా జరిగినా... ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒక హీరోయిన్, అదీ రెడ్డి గారి అమ్మాయి పెళ్లిలో కన్యాదానం చేసింది మరెవరో కాదు... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. సమీరా రెడ్డి పెళ్లి జరిగిన సమయంలో విజయ్ మాల్యా చాలా పెద్ద పేరున్న వ్యక్తి. అసలు ఆ కన్యాదానం వెనుక కహానీ ఏమిటంటే?

జనవరి 21, 2014న సమీరా రెడ్డి పెళ్లి చేసుకున్నారు. ఆమె టూవీలర్ డిజైనర్ అక్షయ్ వర్దేను సాంప్రదాయ మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.విజయ్ మాల్యా ఇప్పుడు వివాదాల్లో ఉంటున్నారు కానీ ఒకప్పుడు ఆయన విలాసవంతమైన జీవన శైలికి ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. కింగ్‌ ఫిషర్ ఎయిర్‌లైన్స్, పార్టీలు, గ్లామరస్ క్యాలెండర్ షూట్స్‌కు పేరు గాంచారు. సమీరా పెళ్లిలో తండ్రి స్థానాన్ని పోషించారు. సమీరా రెడ్డితో ఆయనకు రక్త సంబంధం లేదు కానీ విజయ్ మాల్యా కన్యాదానం నిర్వహించారు.

Continues below advertisement

విజయ్ మాల్యా కన్యాదానం చేశారు

సమీరా రెడ్డి DNAకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా కన్యాదానం చేసిన విషయం గురించి వెల్లడించారు. సమీరా రెడ్డి తన పెళ్లి మొదట ఏప్రిల్ 2014లో జరగాల్సి ఉందని చెప్పింది. కానీ కొన్ని మార్పుల కారణంగా వాయిదా పడింది. అదే సమయంలో తనకు కన్యాదానం విజయ్ మాల్యా చేశారని వెల్లడించారు. విజయ్ మాత్రమే ఆమె తల్లి వైపు బంధువు. దాంతో ఆయన ఈ ఆచారం నిర్వహించారు. ఆయన తనను వరుడికి అప్పగించారని వివరించారు.

Also ReadAnaganaga Oka Raju Box Office Collection Day 1: రాజుగారు అదరగొట్టారు...నవీన్ పోలిశెట్టి సినిమా ''అనగనగా ఒక రాజు' ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే?

ఇప్పుడు సమీరా రెడ్డి నటనకు దూరంగా ఉన్నారు. తన సమయాన్ని కుటుంబానికి కేటాయించారు. అయితే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ కనెక్ట్ అవుతున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తున్నారు.

Also ReadMSVG Box Office Day 3: 'రాజా సాబ్', 'ధురంధర్' కంటే ఎక్కువ... మూడో రోజు మెగాస్టార్ చిరంజీవి 'వరప్రసాద్ గారు' కలెక్షన్ ఎంతంటే?