Makers Looking For New Title To NTR Neel Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ టైటిల్ మారుస్తారనే ప్రచారం సాగుతోంది.
అసలు కారణం ఏంటంటే?
ఈ మూవీకి కొత్త టైటిల్ కోసం నిర్మాతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ పెడతారని ప్రచారం సాగింది. ఇప్పటికీ సోషల్ మీడియాలోనూ.. మూవీ అప్‌డేట్స్ విషయంలోనూ ఇదే టైటిల్ అంటూ పేర్కొన్నారు. అయితే.. 'డ్రాగన్' ఇటీవలే వచ్చిన తమిళ మూవీ పేరుతో రిజిస్టర్ అవడం వల్ల సమస్య తలెత్తింది. దీన్ని 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో తెలుగులోనూ డబ్ చేశారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ 'డ్రాగన్' వేరే లెవల్‌లో ఉంటుందని అప్పట్లోనే నిర్మాత కామెంట్స్ చేశారు. దీంతో సినిమా టైటిల్ కూడా అదే కన్ఫర్మ్ చేశారంటూ అంతా భావించారు. ఇప్పటికే ఈ పేరు తమిళ మూవీ పేరుతో రిజిస్టర్ కావడం, చట్టపరమైన చిక్కులు, ఫ్యాన్స్‌కు కన్ఫ్యూజన్ లేకుండా వేరే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. ఎన్టీఆర్ రేంజ్, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఏ టైటిల్ పెడతారో అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Also Read: కోహ్లీ లైక్‌తో అవనీత్‌కు 20 లక్షల మంది ఫాలోవర్స్ - రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్ ఇదే!
ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన 'సప్తసాగరాలు దాటి' ఫేం రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, టి సిరీస్ ఫిలిమ్స్ (గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. రవిబ్రసూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక యాక్షన్ సీన్స్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే, అనుకోని కారణాలతో జూన్ 25, 2026న రిలీజ్ చేస్తామని ఇటీవలే ప్రకటించారు.
ఫ్యాన్స్‌కు నిరాశే..
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2' నుంచి అప్డేట్ ఉందని దీన్ని వాయిదా చేశారు. 'వార్ 2' నుంచి ఆ రోజున టీజర్ రిలీజై ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.