Mahesh Thakur About Malini Iyer And Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి.. సినిమాల్లో ఎవర్‌గ్రీన్‌ నటిగా పేరు దక్కించుకున్నారు. కానీ ఆమె బుల్లితెరపై కూడా ఒక ఫేమస్ సీరియల్‌లో నటించారన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. అదే ‘మాలిని అయ్యర్’. శ్రీదేవి హీరోయిన్‌గా ఫేమ్ సంపాదించుకొని సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ‘మాలిని అయ్యర్’ సీరియల్‌లో నటించి అందరికీ షాకిచ్చారు. అంతే కాకుండా అందులో తను మొదటిసారి కామెడీ రోల్‌లో కూడా కనిపించారు. తాజాగా ఆ సీరియల్‌లో శ్రీదేవి భర్తగా నటించిన మహేశ్ ఠాకూర్.. తనతో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. అంతే కాకుండా ఒక సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.


శ్రీదేవికి భర్తగా..


మహేశ్ ఠాకూర్.. సీరియల్స్‌లో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి బాలీవుడ్‌లో మంచి గుర్తింపును సాధించుకున్నారు. ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమాలో మహేశ్ క్యారెక్టర్‌ను ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. 2004లో సహారా వన్ ఛానెల్‌లో ప్రసారమయిన ‘మాలిని అయ్యర్’ సీరియల్‌లో ఆయన శ్రీదేవి భర్త పాత్రలో నటించారు. ఆ సీరియల్‌లో ఎప్పుడూ అల్లరి చేసే భార్యను భరించే భర్తగా మహేశ్ నటన ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్‌ను శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ ఠాకూర్.. ‘మాలిని అయ్యర్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


భయపడేవారు..


‘‘శ్రీదేవి చాలా మంచి మనిషి. తను నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. నేను పనిచేసిన అందరు ఆర్టిస్టులలో తనే చాలా మంచి వ్యక్తి. కానీ తనకు ఉన్న సెలబ్రిటీ స్టేటస్‌ను దృష్టిలో పెట్టుకొని ఎవరూ తన దగ్గరకు వెళ్లేవారు కాదు. తను కుర్చీలో కూర్చొని ఉంటే అందరూ తనకు ఆరు, ఏడు అడుగుల దూరంలో ఉండేవారు. ఎవరూ దగ్గరికి వెళ్లే ధైర్యం చేసేవారు కాదు. భయపడేవారు’’ అంటూ శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు మహేశ్. ‘‘నేను శ్రీదేవిని మొదటిరోజు కలిసినప్పుడు తను చాలా వినయం ఎక్కువ అని అర్థమయ్యింది. ఆ మొదటిరోజే నాకు తనతో ఫస్ట్ నైట్ సీన్ చేయాల్సి వచ్చింది. మేము దానికి రిహార్సెల్ చేసి డైలాగులు కూడా కలిసే నేర్చుకున్నాం’’ అని ఒక ఫన్నీ సంఘటనను బయటపెట్టారు మహేశ్.


బాగా కలిసిపోయాం..


‘మాలిని అయ్యర్’ సీరియల్ చేస్తున్న సమయంలోనే మహేశ్ ఠాకూర్.. ‘షరారత్’ అనే మరో సీరియల్ కూడా చేస్తున్నారు. అయితే రెండు సీరియల్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వవేమో అని మేకర్స్ తనను ‘మాలిని అయ్యర్’ నుండి తప్పుకోమన్నారట. కానీ తను డేట్స్ అడ్జస్ట్ చేస్తానని హామీ ఇచ్చి చివరి వరకు రెండు సీరియల్స్‌లో ఆయనే నటించారు. ఇంతకు ముందు కూడా ‘మాలిని అయ్యర్’లో శ్రీదేవిలో ఇంటిమేట్ సీన్స్‌పై మహేశ్ ఠాకూర్ స్పందించారు. ‘‘మా ఇద్దరి మధ్య ఎక్కువగా రొమాంటిక్స్ సీన్స్ ఉండడం వల్ల మేము బాగా కలిసిపోయాం. శ్రీదేవి ఎప్పుడూ అందరితో కంఫర్ట్‌గా ఉండేది. అందుకే తనతో నటించడం సులభంగా అనిపించేది’’ అంటూ శ్రీదేవి గురించి గొప్పగా మాట్లాడారు మహేశ్ ఠాకూర్.


Also Read: రూ.1000 కోట్లతో అమీర్ ఖాన్ ‘మహాభారత్’ - షారుఖ్, సల్మాన్ పాత్రలు ఇవేనట!