Mahesh Babu Rajamouli Movie Varanasi Title Controversy Cleared : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'వారణాసి'. రీసెంట్‌గా 'GlobeTrotter' ఈవెంట్‌లో మూవీ టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచీ కాంట్రవర్శీ మొదలైంది. ఈ మూవీ టైటిల్ తమదేనని... తమ అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం చాంబర్‌ను ఆశ్రయించారు.

Continues below advertisement


కాంట్రవర్సీ క్లియర్... కొత్త పేరేంటంటే?


తాము ముందుగానే 'వారణాసి' పేరుతో టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నామంటూ ఫిలిం చాంబర్‌లో ఓ చిన్న నిర్మాత ఫిర్యాదు చేశారు.  తెలుగులోనే సదరు నిర్మాణ సంస్థ ఆ పేరు రిజిస్టర్ చేసుకోవడంతో... టైటిల్‌లో చిన్న చేంజ్ చేయాలని మూవీ టీం భావిస్తోందట. పలు భాషల్లో 'వారణాసి' పేరుతోనే మూవీ రిలీజ్ కానుండగా... తెలుగులో మాత్రం 'రాజమౌళి వారణాసి' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. దీంతో వివాదం ముగిసినట్లే కనిపిస్తోంది.


అయితే, భారీ ఈవెంట్‌తో స్పెషల్‌గా టైటిల్ అనౌన్స్ చేయడంతో 'వారణాసి' పూర్తిగా జనాల్లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా గ్లింప్స్‌లో రుద్రగా మహేష్ బాబు లుక్ కానీ, సినిమాలో మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తూ చూపించిన విజువల్స్ ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాయి. ఈ దశలో చిన్న నిర్మాతల నుంచి రాజమౌళి టైటిల్ రైట్స్ దక్కించుకోవడం ఒకటే రాజమౌళి ముందున్న ఆప్షన్ అనే ప్రచారం సాగింది. అయితే, అవేవీ లేకుండా పేరు చెక్కు చెదరకుండా కేవలం ఓ చిన్న మార్పుతోనే జక్కన్న కాంట్రవర్సీకి చెక్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా దర్శక ధీరుడి ప్లాన్ మామూలుగా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : 'మన శంకరవరప్రసాద్ గారు' ఓటీటీ బిగ్ డీల్ ఫిక్స్! - మెగాస్టార్ మూవీ అంటే అట్లుంటది మరి


'వారణాసి' టైటిల్ అనౌన్స్ చేయక చాలా రోజుల ముందే రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె విజయ్ రిజిస్టర్ చేయించారు. గతంలో ఆది సాయికుమార్, రకుల్ ప్రీత్ సింగ్‌తో 'రఫ్' మూవీ తీసిన డైరెక్టర్ సీహెచ్ సుబ్బారెడ్డి ఈ టైటిల్ అనౌన్స్ చేశారు. మాస్, కమర్షియల్, ఎమోషనల్ అంశాలతో సనాతన ధర్మం గొప్పదనం తెలియజేసేలా మూవీ తీస్తామంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత రాజమౌళి కూడా అదే టైటిల్ అనౌన్స్ చేయడంతో వివాదం నెలకొంది. దీనిపైనే తాజాగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.


మరోవైపు, 'వారణాసి' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రిలీజ్‌కు ఏడాది ముందు నుంచే మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమోషన్స్ మొదలుపెట్టేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇక మందాకిని పాత్రలో ప్రియాంక కనిపించనుండగా... విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఈ మూవీతో సిల్వర్ స్క్రీన్‌పై హాలీవుడ్ స్థాయిలో ఓ సరికొత్త ప్రపంచం, అద్భుతం క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నారాయణ దీన్ని నిర్మిస్తుండగా... 2027 సమ్మర్‌కు ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.