మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఒక సెంటిమెంట్ ఉంది. తన సినిమా టైటిల్ 'అ' అక్షరంతో మొదలు అయ్యేలా చూస్తారు. దర్శకుడిగా తొలి సినిమా 'నువ్వే నువ్వే', ఆ తర్వాత 'జల్సా', 'ఖలేజా' మినహా మిగతా సినిమా టైటిల్స్ అన్నీ 'అ' అక్షరంతో మొదలైనవే. మరి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న కొత్త సినిమా టైటిల్ విషయంలోనూ ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా? లేదా? అనేది చూడాలి. 


మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి... 'అతడు'. రెండు... 'ఖలేజా', సుమారు 12 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ సినిమా చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 31న సినిమా అప్ డేట్ రానుంది. టైటిల్ లేదా సినిమాలో హీరో పేరు అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి 'అర్జునుడు' టైటిల్ పరిశీలనలో ఉందట! (Mahesh Babu - Trivikram latest movie - SSMB 28 titled as Arjunudu)


'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా టైటిల్ 'అ' అక్షరంతో మొదలైంది. మహేష్ సినిమాకూ అదే సెంటిమెంట్ ఫాలో అవుతారని ఊహించవచ్చు. అయితే, ఆ టైటిల్ ఏమై ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది 'అర్జునుడు' టైటిలా? కదా? అనేది మే 31న తెలుస్తుంది.  


Also Read: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - పూజా హెగ్డే, త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - తమన్ కాంబినేషన్ లో కూడా హ్యాట్రిక్ చిత్రమిది. త్రివిక్రమ్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో 'అరవింద సమేత వీరరాఘవ', 'అల వైకుంఠపురములో' చేశారు పూజా హెగ్డే. సో... ఇది హ్యాట్రిక్ మూవీ. ఆ రెండు చిత్రాలకూ సంగీతం అందించిన తమన్, ఈ సినిమాకూ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మది, కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఎ.ఎస్. ప్రకాష్


Also Read: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్