ప్రేక్షకుల మనసులు గెలిచిన సినిమా 'లిటిల్ హార్ట్స్' (Little Hearts 2025). బాక్స్ ఆఫీస్ బరిలో ఈ సినిమా 32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. సామాన్యులను మాత్రమే కాదు... సెలబ్రిటీలను సైతం 'లిటిల్ హార్ట్స్' మెప్పించింది. మాస్ మహారాజా రవితేజ నుంచి మొదలు పెడితే న్యాచురల్ స్టార్ నాని, మ్యాచో స్టార్ గోపీచంద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు... అందరూ సినిమా చూసి ట్వీట్స్ చేశారు. ఇప్పుడీ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు చేరారు. ఆయన సినిమా చూసి ట్వీట్ చేశారు. మరి, రివ్యూ ఏమిచ్చారో తెలుసా?
సింజిత్... నువ్ ఫోన్ ఆపేసి పక్కకు వెళ్ళకు!'లిటిల్ హార్ట్స్'కు సంగీతం అందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమిల్లి తెలుసుగా! అతను మహేష్ డై హార్డ్ ఫ్యాన్. అతని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
''లిటిల్ హార్ట్స్... సరదాగా ఉంది. ఫ్రెష్‌గా ఉంది. మనస్సుల్లో పెద్ద చోటు సొంతం చేసుకుంది. యంగ్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. సినిమాకు ఎక్సట్రాడినరీ కాస్ట్ కుదిరింది. భలే సరదాగా ఉంది'' అని మహేష్ పేర్కొన్నారు. ఇక తన వీరాభిమాని సింజిత్ గురించి... ''నువ్వు దయచేసి ఫోన్ ఆపేసి ఎక్కడికి వెళ్లొద్దు బ్రదర్. కొన్ని రోజులు నువ్వు చాలా బిజీగా ఉంటావ్. ఇలాగే అదరగొట్టేయ్'' అని చెప్పారు. టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. 'నేను ఎక్కడికీ వెళ్ళను అన్నా' అంటూ రిప్లై ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. Also Read: రామ్ చరణ్ 'పెద్ది' ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది... విజయదశమి కానుకగా మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్!
మౌళి తనూజ్ ప్రశాంత్, శివానీ నాగరం జంటగా నటించిన 'లిటిల్ హార్ట్స్'కు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేశారు. ఈటీవీ విన్ ఓటీటీ కోసం తీసిన ఒరిజినల్ ఇది. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేశారు.
Also Read: ఎవరీ మహికా శర్మ? - క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఫేమస్ మోడల్... ఈ విషయాలు తెలుసా!