Mahesh Babu's Varanasi Movie Title Glimpse Out : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి మూవీ 'వారణాసి' నుంచి టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. సినిమాకు సంబంధించి వరల్డ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూనే అద్భుతమైన విజువల్స్ ప్లే చేశారు. ఈ మూవీలో రుద్రుడిగా మహేష్ కనిపించనున్నారు. నందిపై శివునిలా చేతిలో త్రిశూలంతో ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ లుక్‌తో పాటే స్పెషల్ గ్లింప్స్ కూడా రివీల్ చేశారు.
విశ్వంతరాలను దాటి, అంటార్కిటికా, ఆఫ్రికా ఖండాలను టచ్ చేస్తూ... రామాయణంలో లంకా నగరం, రాముడు, ఆంజనేయుడు అన్నీ పాత్రలను గ్లింప్స్‌లో చూపించారు. అయితే, ఫస్ట్ లుక్‌లో నందిపై శివుడిలా చేతిలో త్రిశూలంతో మహేష్ కనిపించడం మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
విజువల్స్ అద్భుతం... స్టోరీపై ఆసక్తి
'వారణాసి' గ్లింప్స్‌లో ఒక్కో ఫ్రేమ్ ఒక్కో అద్భుతంలా ఉంది. అప్పటి వారణాసి నగరాన్ని చూపిస్తూనే... మహర్షుల యాగంతో పాటు ఇప్పటి కాలంలో ఆస్టరాయిడ్ శాంభవి అంటార్కిటికా ఖండంలోని మంచు కొండలో 'రోస్ ఐస్ సెల్ఫ్'లో పడడం అక్కడి నుంచి అప్పటి జంతుచరాలు, అనంతరం వనాంచల్‌లోని ఉగ్ర భట్టి గుహలో ఉగ్ర కాళీమాత విగ్రహాన్ని చూపిస్తూ గూస్ బంప్స్ తెప్పించారు.
ఇక అక్కడి నుంచి కథను రామాయణానికి లింక్ చేశారు. తీర్థయుగ లంకా నగరం, ఆంజనేయుని పరాక్రమం, యాక్షన్ సీక్వెన్స్, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసుకొస్తున్నాడా? అనేట్లుగా ఉన్న లుక్ వేరే లెవల్. ఇక డైరెక్ట్‌గా లంకా నగరం నుంచి వారణాసి 'మణికర్ణిక' ఘాట్‌ను చూపిస్తూ నందిపై పరమశివుడిలా రుద్రుడిగా చేతిలో త్రిశూలంతో మెడలో నంది లాకెట్‌తో మహేష్ లుక్ అదిరిపోయింది. గ్లింప్స్‌తో ఎన్నో ప్రశ్నలు, హైప్ క్రియేట్ చేశారు రాజమౌళి. మరి వాటికి ఆన్సర్ తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.