Mahesh Babu Rajamouli SSMB29 Movie Titled As Varanasiv : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో 'SSMB29' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీ టైటిల్‌ను 'వారణాసి'గా అనౌన్స్ చేశారు రాజమౌళి.

Continues below advertisement

అందరూ అనుకున్నట్లుగానే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈవెంట్ ప్రారంభంలోనే టైటిల్ అనౌన్స్ చేసేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియోను కూడా అనౌన్స్ చేశారు.

మహేష్ ఫస్ట్ లుక్ గూస్ బంప్స్

Continues below advertisement

కేవలం ఒక్క ప్రీ లుక్‌తోనే ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ చేయగా దాన్ని పదింతలు చేసేలా మహేష్ ఫస్ట్ లుక్ ఉంది. ప్రపంచమంతా తిరిగే సంచారిగా 'GlobeTrotter' మహేష్‌ లుక్ వేరే లెవల్‌లో ఉంది. నందిపై పరమ శివుడిలా చేతిలో త్రిశూలంతో మెడలో నందితో కూడిన లాకెట్‌తో మహేష్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 100 అడుగుల భారీ స్క్రీన్‌పై దీన్ని ప్రసారం చేయగా... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'GlobeTrotter' ఈవెంట్‌లో దీన్ని ఫోటోస్ తీసి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే అఫీషియల్‌గా రివీల్ చేయనున్నారు. ఇందులో మహేష్ రుద్రగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read : 'శివ' రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేశాయంతే - ఎన్నేళ్లైనా కింగ్ జోష్ తగ్గేదేలే... అప్పటితో పోలిస్తే...