Mahesh Babu New Look Gone Viral In Maldives Tour : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోయే పాన్ వరల్డ్ హై యాక్షన్ థ్రిల్లర్ 'SSMB29' కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ లుక్‌తో పాటు 'Globle Trotter' అంటూ బిగ్ హింట్ ఇచ్చారు జక్కన్న. ఇక నవంబరులో ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుండగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. 

Continues below advertisement

మాల్దీవుల్లో మహేష్ బాబు

పలు షెడ్యూల్స్ ఇప్పటికే కంప్లీట్ కాగా రీసెంట్‌గానే హైదరాబాద్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో 'వారణాశి' సెట్ స్పెషల్‌గా వేసి మరీ మహేష్ బాబుపై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారట. ప్రస్తుతం మహేష్ బాబు మాల్దీవుల్లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సముద్రంలో నేచర్ ఆస్వాదిస్తూ ఓ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. అయితే, ఆయన ముఖం కనిపించకుండా జాగ్రత్త వహించారు. 

Continues below advertisement

పొడవాటి జుట్టు ఇదివరకూ చూడని లుక్‌లో ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది. ఇది 'SSMB29' లుక్ అని అందుకే మహేష్ అంత జాగ్రత్తగా వ్యవహరించారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'అన్నా... కొంచెం ఫేస్ రివీల్ చెయ్యొచ్చు కదా', 'సింహం సింగిల్‌గానే వస్తుంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇంతకు ముందు కూడా మహేష్ బాబు లుక్స్ చాలా వరకూ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ బ్యాక్ లుక్ మాత్రం స్పెషల్ అనేలా ఉంది. 

Also Read : ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ ట్విట్టర్ రివ్యూ - హంట్.. డేంజరస్ మాత్రమే కాదు... హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ ఎలా ఉందో తెలుసా?

జక్కన్న 'SSMB29' అప్డేట్ ప్లీజ్

'బాహుబలి ది ఎపిక్' ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, రానా, రాజమౌళి సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా రానా, ప్రభాస్ ఇద్దరూ 'SSMB29' అప్డేట్ ఇవ్వాలని కోరగా... ఆయన నవ్వుతూనే నిరాకరించారు. 'నేను ఆల్రెడీ రెండు మూవీస్ తీసేశాను. నీ మూవీ ఎప్పుడు జక్కన్న' అంటూ ప్రభాస్ అడగ్గా... 'వస్తుంది త్వరలోనే' అంటూ నవ్వేశారు. ఎక్కడా మూవీ గురించి చిన్న లీక్ కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ మొదలైనట్లు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవ తెలిపారు. ఇక నవంబర్ 16న ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఇవి లాంచ్ చేయనున్నట్లు సమాచారం. మహేష్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ సాహస ప్రయాణంగా మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.