Dimitrius koloamatangi's Predator Badlands Twitter Review In Telugu : సైన్స్ ఫిక్షన్ హిస్టరీలోనే మర్చిపోలేని ఓ భయానక ప్రపంచం... హాలీవుడ్ వరల్డ్‌ను షేక్ చేసేందుకు మరోసారి 'ప్రెడేటర్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఫ్రాంచైజీలో గత స్టోరీస్ కంటే డిఫరెంట్‌గా ఈసారి 'ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్' తెరకెక్కించారు డైరెక్టర్ డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్. ఇప్పటికే హాలీవుడ్ షోలు పడగా నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. 

Continues below advertisement

మూవీ ఎలా ఉందంటే?

'ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్' కేవలం వేట, రక్తపాతమే కాకుండా... యాక్షన్, మానవ సంబంధాలతో పాటు ఫన్ ఎమోషన్‌తో కూడిన మాస్టర్ పీస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని క్రిటిక్స్, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రెడేటర్ అంటే ఓ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుని వచ్చే ఆడియన్స్‌కు అంతకు మించి ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఓ హార్ట్ టచింగ్ ఎంటర్టైనర్ అని... 'All Killer... No Filler' అనేలా గెలాక్సీ రోడ్ మూవీ అని అంటున్నారు.

Continues below advertisement

మునుపెన్నడూ లేని విధంగా డైరెక్టర్ ట్రాచెన్ బర్గ్ ప్రెడేటర్ యూనివర్స్‌ను ఎక్స్‌పాండ్ చేశారని... సర్వైవల్ గేమ్‌కే పరిమితం కాకుండా ప్రెడేటర్ హంట్ వెనుక ఉన్న లెజెండ్, యౌట్జా కల్చర్ వంటి లోతైన అంశాలు టచ్ చేశారని చెబుతున్నారు. ఇది ఫ్యాన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు. డిమిట్రియస్ షస్టర్, కొలోమాటాంగీ & ఎల్లె ఫ్యానింగ్ జోడీ తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని పండించిందని కామెంట్ చేస్తున్నారు. ఏలియన్ హంట్ ఉద్రిక్తత మధ్యలో కూడా వారి మధ్య కనిపించే హ్యుమానిటీ, ఫ్రెండ్షిప్‌, హ్యూమర్‌ సినిమాకు సరికొత్త ఫీల్‌ ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటుందని రివ్యూస్ రాస్తున్నారు.

Also Read : ఓటీటీలోకి వచ్చేస్తున్నా 'డ్యూడ్'! - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?

కాస్త వెయిట్ చేయాల్సిందే

ఇండియాలో 'ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్' నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుండగా... ఇప్పటికే హాలీవుడ్‌లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మరి ఈ 'ఎమోషనల్ అడ్వెంచర్ హంట్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.