Mahesh Babu Look From SSMB29 Shooting Set Leaked: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ హై అడ్వెంచర్ థ్రిల్లర్ 'SSMB29'. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ విజువల్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కెన్యాలో జరుగుతుండగా... సెట్ నుంచి లీక్ అయిన మహేష్ బాబు లుక్ వైరల్ అవుతోంది.

కెన్యాలోని నైరోబీలో షూటింగ్ జరుగుతుండగా... మహేష్ బాబుపై ఓ సీన్ చిత్రీకరిస్తున్న టైంలో తీసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. దీన్ని సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ అడ్వెంచర్ సీన్‌లో ఆయన నటిస్తున్నట్లుగా ఫోటో ఉండగా... కొందరు మహేష్ లుక్‌ను ప్రశంసిస్తూనే ఇలా లీక్ కావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మహేష్ లుక్ లయన్‌లా  ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: స్వీటీ అని పిలవాలా... 'ఘాటి' అని పిలవాలా? - షీలావతితో పుష్పరాజ్ ఫోన్ కాల్... ప్రమోషన్స్‌లో తగ్గేదేలే

లీకుల బెడద తప్పదా?

సాధారణంగా రాజమౌళి మూవీ అంటే మామూలు విషయం కాదు. ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి ప్రమోషన్స్ వరకూ ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. 'SSMB29' విషయంలో ఆయన మొదటి నుంచి సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ వస్తున్నారు. అసలు ఈ మూవీలో మహేష్ బాబు నటిస్తున్నారన్న ఒక్క విషయం తప్ప ఇక ఏదీ ఆయన అధికారికంగా ప్రకటించలేదు. ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడే స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేశారు రాజమౌళి. షూటింగ్ సెట్స్‌లోకి హీరోతో పాటు ఎవ్వరి ఫోన్లను అనుమతి లేకుండా చేశారు. 

అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మూవీకి లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. గతంలో ఒడిశాలో షూటింగ్ జరిగిన సమయంలో ఈ మూవీకి సంబంధించి ఓ వీడియో లీక్ అయింది. అందులో మహేష్ బాబు ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కాగా... మూవీ టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీన్ని షేర్ చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించి... టీం సదరు లీక్డ్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించింది. తాజాగా ఇప్పుడు కెన్యాలోని షూటింగ్ సెట్‌లో ఫోటో లీక్ కావడంపై అందరూ షాక్ అవుతున్నారు. మూవీ టీం మరింత జాగ్రత్తలు తీసుకోవాలంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

2 పార్టులుగా... 120 దేశాల్లో

కెన్యాలో షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఇటీవల రాజమౌళి అండ్ టీం ఆ దేశ క్యాబినెట్ సెక్రటరీ ముసాలియాని కలిశారు. తమ దేశాన్ని ఎంచుకున్నందుకు ఆనందం వ్యక్తం చేసిన ఆయన... 120 దేశాల్లో పాన్ వరల్డ్ స్థాయిలో 'SSMB29' రిలీజ్ అవుతుందని చెప్పారు. ఇక ఈ మూవీ రెండు పార్టులుగా ఉంటుందని అక్కడి మీడియా తాజాగా పేర్కొంది. దీంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ స్టార్ ఆర్.మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'Globe Trotter'గా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ సాహస ప్రయాణంగా ఈ మూవీ తెరకెక్కనుంది. 2027లో ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.