Mahaavatara Narasimha OTT: హోంబలే ఫిల్మ్స్ , క్లీమ్ ప్రొడక్షన్స్ మహాఅవతార్ నరసింహ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. మహాఅవతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా వడుదలైనప్పటి నుండి రికార్డులు సృష్టిస్తోంది . భారతీయ యానిమేటెడ్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ లను ఏర్పాటు చేస్తోంది. ఈ దివ్యమైన కథను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు ప్రేక్షకులు. భారీ భారీ చిత్రాలను పక్కకునెట్టి మరీ నరసింహ స్వామి చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసింది. థియేటర్లలో సంచలన విజయం అందుకున్న తర్వాత లేటెస్ట్ గా OTTలోకి వచ్చింది. 24 గంటలైనా గడవకముందే OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా చరిత్ర సృష్టించి కొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది.
మహాఅవతార్ నరసింహ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రికార్డును సృష్టించింది
మహాఅవతార్ నరసింహ OTT విడుదలతో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మరో పెద్ద మైలురాయిని సాధించింది... నెట్‌ఫ్లిక్స్‌లో 24 గంటలకు పైగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇది సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎంత ఆదరణ లభిస్తోందో స్పష్టంగా చూపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, OTTలో కూడా ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.
మహాఅవతార్ నరసింహ తరువాత ఫ్రాంచైజీలో ఈ సినిమాలు వస్తాయి
హోంబలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్ కలిసి ఈ గ్రాండ్ యానిమేటెడ్ ఫ్రాంచైజీ అధికారిక లైనప్‌ను విడుదల చేశాయి. వచ్చే దశాబ్దం పాటూ శ్రీ మహావిష్ణువు దశావతారాలను ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతోంది. ఈ విశ్వం మహాఅవతార్ నరసింహ (2025)తో ప్రారంభమవుతుంది...ఆ తర‌్వాత మహాఅవతార్ పరశురామ్ (2027), మహాఅవతార్ రఘునందన్ (2029), మహాఅవతార్ ద్వారకాధీష్ (2031), మహాఅవతార్ గోకులనంద్ (2033), మహాఅవతార్ కల్కి పార్ట్ 1 (2035) మరియు మహాఅవతార్ కల్కి పార్ట్ 2 (2037) వస్తాయి. ఈ విశ్వం భారతీయ పురాణాలను కొత్త సాంకేతికత , వైభవంతో ప్రేక్షకులకు అందిస్తోంది.
మహాఅవతార్ నరసింహ గురించి
మహాఅవతార్ నరసింహ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు... శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ మరియు చైతన్య దేశాయ్ క్లీమ్ ప్రొడక్షన్స్ కింద నిర్మించారు. ఈ చిత్రం ఐదు భారతీయ భాషల్లో 25 జూలై 2025న విడుదలైంది. సెప్టెంబర్ 19 శనివారం మధ్యాహ్నం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది మహావతార్ నరసింహ. కేవలం 40 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా 300 కోట్లు వసూలు చేసింది. సాధారణంగా యానిమేషన్ సినిమా అంటే కేవలం పిల్లలు మాత్రమే చూసేది అనుకుంటారు కానీ ఆ అభిప్రాయాన్ని మార్చేసింది మహావతార్ నరసింహ. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా వచ్చిన ఈ మూవీ థియేటర్లలోకి దిగిన ఫస్ట్ డే నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ప్రేక్షకుల రద్దీ కొనసాగుతూ వచ్చింది. నెమ్మదిగా మొదలైన వసూళ్లు 300 కోట్లకు చేరాయంటే అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది