Magadheera: ‘మగధీర’ రీ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ - ట్రైలర్ కూడా వచ్చేసింది చూశారా?

Magadheera Re Release: ‘మగధీర’ గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. టాలీవుడ్ మార్కెట్‌ను మార్చిన సినిమాగా చెప్పుకుంటారు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఈ మూవీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.

Continues below advertisement

Magadheera Re Release Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజుకు ఇంకా కొన్నిరోజులే ఉంది. అందుకే తన ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వారిని ఖుషీ చేయాలని ఈ హీరో ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే తన అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ బయటికొచ్చాయి. వాటితో పాటు రామ్ చరణ్‌కు ఇండస్ట్రీలో మొదటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ‘మగధీర’ను మరోసారి థియేటర్లలో విడుదల చేసి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘మగధీర’ సినిమా రీ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది గీతా ఆర్ట్స్.

Continues below advertisement

అప్పట్లోనే అంత బడ్జెట్..

రాజమౌళి.. సినిమాల్లో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి ఒక్క ఫ్లాప్‌ను కూడా ఎదుర్కోలేదు. తన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’ నుండి అన్ని హిట్లనే అందుకున్నారు. కానీ ఆయనను దర్శక ధీరుడిగా మార్చిన మూవీ మాత్రం ‘మగధీర’. అప్పటివరకు టాలీవుడ్‌ అనేది ఒక రీజియనల్ సినిమా. ఇతర భాషా ప్రేక్షకులు తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అందుకే టాలీవుడ్‌కు పెద్దగా మార్కెట్ కూడా లేదు. కానీ అప్పట్లోనే రూ.50 కోట్లకు పైగా బడ్జెట్‌తో ‘మగధీర’ను తెరకెక్కించారు. ఒక తెలుగు సినిమా అంత ఎక్కువ బడ్జెట్‌ను రాబట్టలేదని అందరూ నిరుత్సాహపరిచినా.. రాజమౌళి వినకుండా తను అనుకున్నది సాధించి చూపించారు.

మొదటి తెలుగు సినిమా..

2009లో విడుదలయిన ‘మగధీర’.. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన మొదటి తెలుగు సినిమాగా రికార్డ్ సాధించింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్‌కు కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఈ మూవీ కాజల్ కెరీర్‌నే మార్చేసింది. ఇందులో రామ్ చరణ్, కాజల్ కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులే పడ్డాయి. అందుకే తర్వాత చాలామంది మేకర్స్ వీరిద్దరిని హీరోహీరోయిన్లుగా పెట్టి పలు సినిమాలను తెరకెక్కించారు. అలాంటి ‘మగధీర’.. ఇన్నేళ్ల తర్వాత రామ్ చరణ్.. పుట్టినరోజు సందర్భంగా మరోసారి విడుదలకు సిద్ధమయ్యింది. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన గీతా ఆర్ట్స్.. ‘మగధీర’ రీ రిలీజ్ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మగధీర స్పెషల్ షోస్..

‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అద్భుతమైన డైరెక్టర్ రాజమౌళి కలిసి తెరకెక్కించిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ మగధీరకు సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది. ఈ అద్భుతమైన కథను మరోసారి పెద్ద స్క్రీన్స్‌పై చూడండి. మార్చి 27న ఉదయం 8 గంటల నుండి మీ దగ్గర ఉన్న థియేటర్లలో మగధీర స్పెషల్ షోలు ప్రారంభవుతాయి’ అని గీతా ఆర్ట్స్.. సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు తన పుట్టినరోజు సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ లభిస్తున్నాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక తాజాగా సుకుమార్‌తో కలిసి ‘రంగస్థలం 2’పై కూడా క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. 

Also Read: 'రంగస్థలం' కాంబో ఈజ్ బ్యాక్ - ఈసారి పాన్ వరల్డ్ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకునేలా

Continues below advertisement