Narne Nithin's MAD Square Movie OTT Release On Netflix: రీసెంట్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' (MAD Square) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ రికార్డు కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్ తర్వాత  ఈ నెల 25 నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, పాన్ ఇండియా భాషల్లో కాకుండా కేవలం తెలుగులోనే అందుబాటులోకి రానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: రజినీకాంత్ ‘శివాజీ’, చిరంజీవి ‘ముఠామేస్త్రి’ టు బాలయ్య ‘వీరసింహా రెడ్డి’, రవితేజ ‘నేనింతే’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 14) టీవీలలో వచ్చే సినిమాలివే..

2023లో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. టాలీవుడ్ యంగ్ హీరోస్.. నార్నే నితిన్ (Narne Nithin), సంతోష్ శోభన్, రామ్ నితిన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. మూవీలో ప్రియాంక జువాల్కర్, సునీల్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, సత్యంరాజేశ్, మురళీధర్ గౌడ్‌లు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ సమర్పించగా.. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సినిమాకు బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

రికార్డు కలెక్షన్లు

'మ్యాడ్ స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే అదిరే ఓపెనింగ్స్ సాధించగా.. తొలి 3 రోజుల్లోనే రూ.55 కోట్లు.. రూ.75 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. అటు ఓవర్సీస్‌లోనూ కేవలం 14 రోజుల్లోనే రూ.12.45 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది.

స్టోరీ ఏంటంటే?

ఫస్ట్ పార్ట్ 'మ్యాడ్' మూవీలో బీటెక్ కాలేజీ లైఫ్, సరదాలు, సందడి, గొడవలు, లవ్ ప్రధానాశంగా కథ సాగుతుంది. సీక్వెల్‌లో బీటెక్ తర్వాత లడ్డు (విష్ణు ఓయ్), పెళ్లిలో మళ్లీ అశోక్ (నార్నే నితిన్), డిడి (సంగీత్ శోభన్), మనోజ్ (రామ్ నితిన్) కలుస్తారు.‌‌ అయితే, పెళ్లికి ముందే అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్లిపోవడంతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. దీంతో ఫ్రెండ్స్ అంతా కలిసి గోవాకు వెళ్తారు. 

ఆ తర్వాత అక్కడ  వాళ్లు ఎంజాయ్ చేస్తుండగా.. అనుకోకుండా డాన్ మ్యాక్స్ (సునీల్)  చేతిలో చిక్కుకుంటారు. అరుదైన చైన్ చోరీ చేయగా అది వీళ్ల కారణంగా మిస్ అవుతుంది. ఈ క్రమంలో లడ్డు వాళ్ల నాన్నను కిడ్నాప్ చేసిన మ్యాక్స్ 2 రోజుల గడువు ఇచ్చి తన చైన్ తనకు తీసుకురావాలంటాడు. దీంతో ఆ నలుగురు ఫ్రెండ్స్ ఏం చేశారు?, లడ్డు పెళ్లి క్యాన్సిల్ అయ్యాక పెళ్లి మండపంలో అశోక్, డిడి,‌ మనోజ్ ఏం చేశారు? వాళ్లు చేసిన పనికి లడ్డూ ఎందుకు ఫీలయ్యాడు? ఇక గోవాలో వీళ్లను పట్టుకోవాలని పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? వారి నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.