మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.  ప్రకాష్ రాజ్ ను ఢీ కొట్టేందుకు మంచు విష్ణు తన ప్యానెల్ తో రంగంలోకి దిగారు. తన ప్యానెల్ సభ్యులను ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. శుక్రవారం ప్యానెల్ సభ్యులందరితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారట మంచు విష్ణు. ఆ సమావేశంలోనే తన అజెండాను కూడా ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు. అతని ప్యానెల్ కన్నా బలమైన ప్యానెల్ ఎన్నుకుంటానని గతంలోనే మంచు విష్ణు అన్నారు. ‘మా’ కోసం మనమంతరం అనే స్లోగన్ తో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్యానెల్ లో ఎవరెవరు ఏ పదవికి పోటీ పడుతున్నారంటే...

1. మంచు విష్ణు - అధ్యక్షుడు2. రఘుబాబు - జనరల్‌ సెక్రటరీ3. బాబు మోహన్‌ - ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌4. మాదాల రవి - వైస్‌ ప్రెసిడెంట్‌5. పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి - వైస్‌ ప్రెసిడెంట్‌6. శివబాలాజీ - ట్రెజరర్7. కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ8. గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ 

ఇక మంచు విష్ణు ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పోటీ పడుతున్నవాళ్లు..అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వర్ణ మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ఆర్సి

ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్స్...

అధ్యక్షుడు: ప్రకాశ్‌రాజ్‌ట్రెజరర్‌ : నాగినీడుజాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్‌ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌జనరల్‌ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌

ఎగ్జిక్యూటివ్ మెంబర్లు...

అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవింద రావు, ఖయూమ్, కౌశిక్, ప్రగతి, రమణా రెడ్డి, శివా రెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు. డి, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Also read: ఇక్కడ పోలీసులకు చెప్పి మరీ కిడ్నాప్‌లు చేస్తారు.. కేసులు కూడా ఉండవు, 11 గంటల తర్వాత..

Also read: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత