బాక్సాఫీస్ బరిలో 'లక్కీ భాస్కర్' జోరు చూపిస్తున్నాడు. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ డబ్బులు ప్రేక్షకుల నుంచి తీసుకుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ, థియేటర్ల దగ్గర కనబడుతున్న జనాలను చూస్తుంటే 'లక్కీ భాస్కర్' దూకుడు వీకెండ్ తర్వాత కూడా కొనసాగేలా ఉంది. రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయానికి వస్తే...
రెండు రోజుల్లో 26 కోట్లు... నిర్మాతలకు లక్కీ!'లక్కీ భాస్కర్' పేరులో లక్ ఉంది. థియేటర్ల దగ్గర లభిస్తున్న వసూళ్లు చూస్తుంటే నిర్మాతలు లక్కీ అనుకోవాలి. మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. పైడ్ ప్రీమియర్స్ నుంచి 'లక్కీ భాస్కర్' సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. దాంతో ఓపెనింగ్స్ బాగున్నాయి. మొదటి రోజు థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సైతం సినిమాకు సూపర్ హిట్ అని రివ్యూ ఇచ్చేశారు. దాంతో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 14 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
రెండు రోజుల్లో లక్కీ భాస్కర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. సూపర్ హిట్ సినిమా థియేటర్లలోకి వస్తే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మరొక్కసారి ఈ సినిమా నిరూపించింది.
మలయాళంలో దుల్కర్ సల్మాన్ కెరీర్ బెస్ట్?దుల్కర్ సల్మాన్ అంటే మలయాళీ అని కాకుండా మనవాడు అని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. 'మహానటి', 'కనులు కనులను దోచాయంటే' సినిమా విజయాలే అందుకు ఉదాహరణ. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో ఆయన చేసిన పాత్రకు కూడా మంచి స్పందన లభించింది.
దుల్కర్ సల్మాన్ ఎంత మనవాడు అనుకున్నా సరే ఆయన మలయాళీ కదా!మాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. మమ్ముట్టి తనయుడిగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. దుల్కర్ సల్మాన్ హోం గ్రౌండ్ కేరళలో కూడా 'లక్కీ భాస్కర్' సినిమాకు సూపర్ హిట్ టాక్ లభించింది. మలయాళంలో దుల్కర్ కెరీర్ బెస్ట్ సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెబుతున్నారు. మలయాళంలో 45 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫైనల్ రన్ ఎన్ని కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి. ప్రెసెంట్ ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం కనబడుతుంది.
Also Read: లక్కీ భాస్కర్.... ఈ నెలలోనే ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్' సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయకగా నటించింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా... శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాలలో ఇది టాప్ ప్లేస్ లో ఉంది.
Also Read: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఈ బ్లాక్ బస్టర్స్ ఫ్రీగా చూడొచ్చు - ఏయే సినిమాలు ఉన్నాయో తెలుసా?