తాను విశాఖ మూర్తి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నానని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో షెడ్డులో డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేశానని హీరో కమ్ డైరెక్టర్ అనీష్ తెలిపారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'లవ్ ఓటీపీ'. శ్రీమతి పుష్ప మణి రెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. అనీష్ దర్శకత్వం వహించారు. రాజీవ్ కనకాల, జాన్విక, నాట్య రంగ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు.

Continues below advertisement

బన్నీ ఆ సలహా ఇచ్చినా వినలేదు!హీరో - దర్శకుడు అనీష్ మాట్లాడుతూ... ''హీరో అవ్వాలనేది నా చిన్ననాటి కల. ఆ విషయాన్ని మా నాన్నగారికి చెప్పా. ఆయన సాయంతో ఎన్నో ప్రయత్నాలు చేశా. విశాఖలో ట్రైనింగ్ తీసుకున్నా. తెలుగులో 'నెలవంక' చేశా. ఆ సినిమా ప్రారంభోత్సవానికి బన్నీ అతిథిగా వచ్చారు. అయితే చిత్ర నిర్మాణంలోకి 'వద్దు' అని బన్నీ ఇచ్చిన సలహా వినలేదు. 'నెలవంక' తర్వాత కన్నడకు వెళ్లిపోయా. నాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మంచి స్నేహితుడు. 'మళ్లీ రావా' నేను చేయాల్సింది. కానీ, మిస్ అయింది. మళ్ళీ తెలుగు సినిమా చేయాలని ఎప్పట్నుంచో ట్రై చేస్తున్నా. ఇప్పటికి కుదిరింది. 'లవ్ ఓటీపీ'లో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించగా. కంటెంట్‌ను నమ్మి సినిమా చేశా. మా నిర్మాత విజయ్ సహకారాన్ని ఎప్పటికీ మరువలేను'' అన్నారు. 

కొడుకును కూతురిలా చూసే తండ్రి!'లవ్ ఓటీపీ'లో తాను తండ్రి పాత్ర పోషించానని రాజీవ్ కనకాల తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''తెలుగు, కన్నడ భాషల్లో తీసిన చిత్రమిది. ఇందులో నాది కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ తండ్రి పాత్ర. ప్రేక్షకులు అందరూ పగలబడి నవ్వుకునేలా ఉంటుందీ సినిమా. ఆనంద్ సంగీతం చాలా బాగుంటుంది. నాతో పాటు మా అబ్బాయి చిత్రాలకు సంగీతం చేసే అవకాశాన్ని ఇస్తానని ఆయనకు మాటిస్తున్నా'' అన్నారు. 

Continues below advertisement

Also Read: 'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ థియేటర్లు ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!

నిర్మాత విజయ్ ఎం రెడ్డి మాట్లాడుతూ... ''నాకు 16 ఏళ్ళ నుంచి అనీష్ తెలుసు. హైదరాబాద్‌కు సినిమా చేయాలని వచ్చాం. నా నిర్మాణంలో అనీష్‌ని హీరోగా, దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. నవంబర్ 14న సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా'' అన్నారు. హీరోయిన్ జాన్విక, నృత్య దర్శకుడు - నటుడు బాబా భాస్కర్, నాట్య రంగ, ఈ మూవీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్, లిరిక్ రైటర్ దినేష్, కెమెరామెన్ హర్ష, మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.

Also Readనారా రోహిత్ పెళ్లి ముహూర్తం ఖరారు... హల్దీ, మెహందీ నుంచి ముహూర్తం వరకూ... శిరీషతో ఏడడుగులు వేసేది ఎప్పుడంటే?

Love OTP Movie Cast And Crew: అనీష్ హీరోగా నటించిన 'లవ్ ఓటీపీ'లో రాజీవ్ కనకాల, స్వరూపిణి, జాన్విక కలకేరి, ప్రమోదిని, నాట్య రంగ, చేతన్ గంధర్వ, రవి భట్, తులసి, అన్నపూర్ణ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: హర్ష వర్దన్, కూర్పు: శరత్, సంగీత దర్శకత్వం: ఆనంద్ రాజ్ విక్రమ్, నిర్మాణ సంస్థ: భావప్రీత ప్రొడక్షన్స్, నిర్మాత: విజయ్ ఎం రెడ్డి, దర్శకుడు: అనీష్.