ప్రతీ డైరెక్టర్‌కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. కానీ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను నిజం చేసుకునే ఛాన్స్ కొంతమంది దర్శకులకు మాత్రమే దొరుకుతుంది. కొన్నిసార్లు ఆ ప్రాజెక్ట్ అనేది ప్రారంభం అయినా కూడా ఆగిపోవాల్సిన సందర్భాలు వస్తాయి. అలాంటి సందర్భం తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూడా ఫేస్ చేశాడు. సూర్యతో కలిసి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌ను వర్కవుట్ చేయాలని అనుకున్నాడు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని కథ ఏటి అన్న విషయం తాజాగా బయటకి వచ్చింది. దీంతో ఇంత మంచి ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది అని లోకేశ్ ఫ్యాన్స్‌తో పాటు సూర్య ఫ్యాన్స్ కూడా తెగ ఫీలవుతున్నారు.
‘ఇరుంబుకై మాయావి’..
లోకేశ్ కనగరాజ్.. ఇప్పటికి అరడజను సినిమాలు కూడా తెరకెక్కించలేదు. కానీ తీసిన కొన్ని సినిమాలతోనే నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశంలోని పెద్ద పెద్ద స్టార్ల మధ్య కూర్చునేంత స్థాయిని సంపాదించుకున్నాడు. తనతో కలిసి స్టార్ హీరోలు సైతం సినిమాలు చేయడానికి ఎదురుచూసేలా చేసుకున్నాడు. అలాంటి లోకేశ్ కనగరాజ్‌కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే ‘ఇరుంబుకై మాయావి’. సూర్యతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయాలని కూడా అనుకున్నాడు లోకేశ్. కానీ అనూహ్యంగా ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. పైగా ఈ మూవీ 1962లో డీసీ కామిక్స్‌కు చెందిన నవల ‘ది స్టీల్ క్లాన్’ అనే పుస్తకంపై ఆధారపడిందని సమాచారం.
‘ది స్టీల్ కాన్’ కథతో..
‘ది స్టీల్ క్లాన్’ అనే నవల నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక సూపర్ హీరో కథ. ఒక యాక్సిడెంట్‌లో తన చేయి కోల్పోయిన హీరో.. ఆ స్థానంలో ఒక స్టీల్ చేతిని పెట్టుకుంటాడు. మరొక సంఘటన కారణంగా ప్రపంచానికి తన స్టీల్ చేయి తప్పా ఇంకేమీ కనిపించదు. అదే అదునుగా తీసుకొని హీరో.. శత్రువులతో యుద్ధాలు చేసి, తన దేశాన్ని కాపాడుకుంటాడు. ఎంత హీరో అయినా కూడా తన పవర్‌ను కొంచెం నెగిటివ్‌గా ఉపయోగిస్తూ ఉండడంతో ఆ క్యారెక్టర్‌లో కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. సూర్య లాంటి హీరో.. ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న సూపర్‌హీరో పాత్ర చేస్తున్నాడంటే ఆడియన్స్ అంచనాలు ఏ రేంజ్‌లో ఉండేవో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందుకు వెళ్లలేదు.
నిర్మాతలు నమ్మలేదు..
లోకేశ్ కనగరాజ్.. తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ‘ఇరుంబుకై మాయావి’ సినిమా కథను రాసుకున్నాడు. అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త కాబట్టి ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ను నమ్మి, ఈ కథపై డబ్బులు పెట్టడానికి నిర్మాతలు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పుడు లోకేశ్ అడిగితే.. కాదు అనే నిర్మాత ఉండరు కాబట్టి సూర్యతోనే ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని లోకేశ్ అనుకుంటున్నాడట. కాకపోతే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్టు సమాచారం. లోకఏశ్ కనకరాజ్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలు ఎక్కువగా క్రైమ్ డ్రామా, మాఫియా జోనర్లలో తెరకెక్కినవే. కానీ ఇది మాత్రం వాటికి భిన్నంగా ఒక సూపర్ హీరో కథ కావడంతో ప్రేక్షకులు ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సూర్య కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పటికే రోలెక్స్‌గా అడుగుపెట్టాడు.
Also Read: అసిస్టెంట్ పెళ్లికి హాజరయిన రష్మిక, సింపుల్‌గా కనిపిస్తున్నా తన శారీ ధర ఎంతంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial