Little Hearts 2025 Movie Box Office Collection Day 1: అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ డైరెక్షన్ చేసిన 'ఘాటీ' ఒక వైపు...‌‌‌‌ తమిళ హీరో శివ కార్తికేయన్, డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ‌కాంబినేషన్ సినిమా 'మదరాసి' మరో వైపు... ఈ రెండిటి మధ్య 'లిటిల్ హార్ట్స్' మూవీకి ఆడియన్స్ వస్తారా? అని సందేహాలు వ్యక్తం అయ్యాయి.‌‌ ఆ అనుమానాలు అన్నిటినీ పటాపంచలు చేస్తూ మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ సాధించింది.

తెలుగు రాష్ట్రాలలో కోటిన్నర గ్రాస్!Little Hearts 2025 First Day Collection: 'లిటిల్ హార్ట్స్' సినిమా మీద దర్శక నిర్మాతలతో పాటు‌‌ రిలీజ్ చేసిన 'బన్నీ' వాస్, వంశీ నందిపాటికి నమ్మకం ఉండడంతో సెప్టెంబర్ 5న‌‌ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మొదటి రోజు థియేటర్లకు యూత్ బాగా వచ్చారు.

Also Read: 'ఘాటీ' కలెక్షన్స్: తెలుగు రాష్ట్రాల్లో అనుష్క సినిమాకు ఫస్ట్‌ డే ఊహించని రిజల్ట్

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 'లిటిల్ హార్ట్స్' సినిమా కోటి 32 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ రాబట్టింది.‌ గ్రాస్ కలెక్షన్ చూస్తే ఆల్మోస్ట్ కోటిన్నర. స్పష్టంగా చెప్పాలంటే కోటి 47 లక్షల రూపాయలు రాబట్టింది. మరో వైపు అనుష్క 'ఘాటీ' సినిమాకు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కలెక్షన్ రెండు కోట్ల రూపాయలు మాత్రమే.‌ దాంతో కంపేర్ చేస్తే ఈ సినిమాకు బలమైన వసూళ్లు వచ్చినట్టు లెక్క. రెండో రోజు 'ఘాటీ'ని లిటిల్ హార్ట్స్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ కలెక్షన్లలో కూడా 'లిటిల్ హార్ట్స్' ముందంజలో ఉంది. 

Also Read: 'లిటిల్ హార్ట్స్' రివ్యూ: ఎంసెట్ కోచింగ్ సెంటర్‌లో లవ్ స్టోరీ... బాహుబలి కనెక్షన్ ఏంటి?

'90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. మౌళి హీరోగా నటించిన ఈ సినిమాలో 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ఫేమ్ శివాని నాగరం హీరోయిన్.‌ ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. సింజిత్ ఎర్రమల్లి మ్యూజిక్ చేశారు. సినిమాలో వినోదం బావుందని పేరు రావడంతో థియేటర్లకు ప్రేక్షకులు రాక మొదలైంది.