రౌడీ బాడీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా 'లైగర్' (Liger Movie) మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారనేది చెప్పడానికి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే చాలు. ఏపీ, తెలంగాణ, అమెరికా అనే తేడా లేకుండా ప్రపంచం అంతటా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. 


Liger Box Office Day 1 Report : ట్రేడ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... ఒక్క హైదరాబాద్‌లో తొలి రోజు 200 కంటే ఎక్కువ షోలు పడుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీ మాత్రమే కాదు... విశాఖలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి.


పది కోట్ల కంటే ఎక్కువే...
'లైగర్' సినిమాకు తొలి రోజు పది కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదీ తెలుగు రాష్ట్రాల్లో! హిందీలో కూడా విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఉంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమా విడుదల అవుతోంది. అందువల్ల, అన్ని భాషల్లో వసూళ్లు కలిపితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ గ్యారెంటీ!


అమెరికాలో ఎక్స్ట్రా షోలు...
అమెరికాలో 'లైగర్' ప్రీ సేల్స్ (అడ్వాన్స్ బుకింగ్స్) బావున్నాయి.  ప్రస్తుతానికి 182 లొకేషన్లలో 520 షోలు వేస్తున్నారు. సోమవారం ఉదయానికి 8,300 టికెట్స్ సేల్ అయ్యాయి. ఇప్పుడు ఆ కౌంట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కొన్ని ఏరియాలలో టికెట్స్ అన్నీ సేల్ కావడంతో ఎక్స్ట్రా షోలు యాడ్ చేస్తున్నారు. యూకేలో కూడా సినిమాపై మంచి బజ్ నెలకొంది. 






హిందీలో బాయ్‌కాట్‌ ఎఫెక్ట్ ఉంటుందా?
ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' సినిమాను హిందీలో కొంత మంది బాయ్‌కాట్‌ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఆ విషయం గురించి హిందీ మీడియా విజయ్ దేవరకొండను ప్రశ్నించినప్పుడు... ''సినిమాను బాయ్‌కాట్‌ చేసినప్పుడు హీరో, దర్శక - నిర్మాతలతో పాటు ఆ సినిమాకు రోజూ పని చేసే రెండు మూడు వందల మంది గురించి కూడా ఆలోచించాలి. బాయ్‌కాట్‌ గ్యాంగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం'' అని వాఖ్యానించారు. ఆ మాటలు కొందరికి నచ్చలేదు. దాంతో 'లైగర్'ను కూడా బాయ్‌కాట్‌ చేయాలని ట్రెండ్ చేశారు. అయితే... వాళ్ళకు విజయ్ దేవరకొండ అభిమానులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'ఐ సపోర్ట్ లైగర్' అంటూ ట్రెండ్ చేశారు. అందువల్ల, హిందీ బాయ్‌కాట్‌ ఎఫెక్ట్ ఉండదని ఆశించవచ్చు.   


Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మ‌తిరిగే రియాక్షన్


విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్,  ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.


Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి