Akhil Akkineni Lenin Movie First Day Collection: అఖిల్ అక్కినేని కొట్టేశారు... బాక్స్ ఆఫీస్ బరిలోనూ స్ట్రాంగ్ హిట్ కొట్టేశారు. అక్కినేని అభిమానులు అందరూ 'లెనిన్' రిలీజ్ డే 'మనోడు బ్లాక్ బస్టర్ కొట్టేశాడు' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఫ్యాన్స్ సంతోషం బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కనిపించింది. 'లెనిన్' సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్ లభించింది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.
'లెనిన్' ఓపెనింగ్ డే @ 10 కోట్లు ప్లస్!Lenin First Day Collection India Net: ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'లెనిన్' సినిమాకు మంచి ఆరంభం లభించింది. మొదటి రోజు మొదటి ఆట నుంచి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన కనిపించింది.
- ఇండియాలో మొదటి రోజు 'లెనిన్' సినిమాకు 5.90 కోట్ల నెట్ కలెక్షన్ లభించింది.
- ఇండియాలో 'లెనిన్' ఫస్ట్ డే గ్రాస్ విషయానికి వస్తే... రూ. 6.73 కోట్లు.
- ఓవర్సీస్ మార్కెట్స్ నుంచి కూడా 'లెనిన్'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు విదేశాల్లో మూడు కోట్ల రూపాయల గ్రాస్ లభించింది.
- 'లెనిన్' ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ రూ... 9.73 కోట్లు.
- తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బీ, సీ సెంటర్లలో కలెక్షన్లు రిపోర్ట్ చేయాల్సి ఉంది. అవి యాడ్ చేస్తే మరొక కోటి వరకు రావచ్చని ట్రేడ్ వర్గాల టాక్. ఆ లెక్కన మొదటి రోజు పది కోట్లకు పైగా 'లెనిన్' కలెక్ట్ చేసినట్టే.
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాను రాయలసీమలోని చిత్తూరు నేపథ్యంలో రూపొందించారు. మొదటి రోజు మన దేశంలో సుమారు 2,028 షోలు ప్రదర్శించారు. థియేటర్లలో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీ లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ డే ఏకంగా ఆరు కోట్ల గ్రాస్ వసూలు అయ్యింది. కర్ణాటక నుంచి 65 లక్షలు, తమిళనాడు నుంచి మూడు లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో ఐదు లక్షల వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం అఖిల్ సినిమాకు థియేటర్లలో కాంపిటీషన్ లేదు. దాంతో వీకెండ్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.
Also Read: Rajpal Yadav - మళ్ళీ జైలుకు బాలీవుడ్ నటుడు... ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన 'లెనిన్'లో ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు, రమేష్ ఇందిరా, బ్రహ్మాజీ, సునీల్ వర్మ, రాంకీ, 'గెటప్' శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రలలో కనిపించారు. తమన్ సంగీతం అందించగా... లియోన్ బ్రిట్టో ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
