Lavanya Tripathi's Sathi Leelavathi Trailer Reaction : మెగా కోడలు, యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇంతకీ అల్లుడెక్కడ?
భార్యాభర్తల మధ్య అలకలు, చిన్న చిన్న గొడవలతో ప్రారంభమైన ట్రైలర్... నవ్వులు పూయిస్తూనే ఎమోషనల్ టచ్ ఇచ్చింది. '20 ఏళ్ల నా పెంపకంలో కనిపించని నీ నువ్వు మూడేళ్ల మీ సంసార జీవితంలో చూశానమ్మా... ఇంతకీ అల్లుడెక్కడ?' అనే ఎమోషనల్ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. దంపతుల మధ్య మూడో వ్యక్తి వస్తే జరిగే పరిణామాలేంటి?, అందమైన అబ్బాయికి గయ్యాళి లాంటి భార్య వస్తే పరిస్థితి ఏంటి? భర్తను కట్టేసి భార్య ఎందుకు కొట్టింది?
ఇద్దరి మధ్య గొడవలకు కారణమేంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. 'ఇంతకీ అల్లుడెక్కడమ్మా?' అంటూ తండ్రి కూతుర్ని అడగడం... ఆమె భర్తను కట్టేసి కొట్టడం ఆసక్తిని పెంచేసింది. 'కథలు రాసే అలవాటు ఉంది. నాకు కథలు చెప్పకు.', 'అమ్మ లాంటి అమ్మాయి నా లైఫ్‌లోకి వస్తుందని చెప్పావ్ కదా. ఓ పిశాచి లాంటిది వచ్చిందేంటి?' డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి చేసే ప్రయాణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు.
Also Read : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహ రిసెప్షన్ - కొత్త జంటకు మెగాస్టార్ విషెష్... సెలబ్రిటీల సందడి.
Also Read : 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
ఈ మూవీలో దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠిలతో పాటు సీనియర్ హీరో నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్, మొట్ట రాజేంద్రన్,, జాఫర్, జోషి తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాతినేని సత్య దర్శకత్వం వహించగా... ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
