మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల 'సతీ లీలావతి'తో ఈ వారం ఆడియన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ సినిమాను మే 8న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా శనివారం (మే 2వ తేదీన) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అలాగే సినిమా యూనిట్ కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు. ఇంట్లో వాళ్లు ఎలా ఉంటారు? మెగా ఫ్యామిలీతో రిలేషన్, రామ్ చరణ్‌తో ఉండే బంధం ఇలా అన్నింటి గురించి లావణ్య చెప్పారు.

రామ్ చరణ్ బావకు థాంక్స్ - లావణ్య త్రిపాఠి''మా మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన మా బావ రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన మాకు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటారు. మా ఫ్యామిలీలో ఆయన అందరికీ అండగా ఉంటారు. ఆయన మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ద్వారా మా సినిమాకి రీచ్ మరింతగా పెరిగింది'' అని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...

Also ReadJetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

''బయట ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో... వరుణ్ ఫ్యామిలీ కూడా అంతే సింపుల్‌గా ఉంటారు. కామన్ ఫ్యామిలీస్‌లానే ఉంటారు. స్టార్స్ అన్న ఇమేజ్‌ని చూపించరు. అందరూ కలిసి మెలిసి ఉంటారు. మా అమ్మ వాళ్లు కూడా వరుణ్ ఫ్యామిలీ, వాళ్ళ సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయారు. ఈ ట్రైలర్‌లోని డైలాగ్‌లానే.. నేను ఇంట్లో జరిగే విషయాల్ని ఇంటికే పరిమితం చేస్తాను. నాలుగు గోడల మధ్య జరిగింది బయటకు తీసుకు రాను'' అని లావణ్య తెలిపారు.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

రామ్ చరణ్‌ (Ram Charan)తో తమకు ఎంతో మంచి బంధం ఉందని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అడగమని, అస్సలు మొహమాట పడొద్దని రామ్ చరణ్ చెబుతుంటారట. ''రామ్ చరణ్‌ను ఎలా పిలవాలి అని అడిగితే... 'నీ ఇష్టం. ఆర్‌సి అని అయినా పిలువు... బావ అని అయినా పిలువు' అని ఆప్షన్స్ ఇచ్చారు'' అని చెప్పారు లావణ్య. రామ్  చరణ్ తనకు అన్న లాంటివారు అని, ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటారని... ''ఇంట్లో బావ అని పిలవను. కానీ నాకు బంధం విలువ తెలుసు. ఆయన మాకంటే పెద్ద వారు. మా ఫ్యామిలీలో ఆయనే మా అందరికీ అండ'' అని లావణ్య చెప్పుకొచ్చారు.

Also ReadGaayaPadda Simham Review - 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?