కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) తెలుగులోనూ పాపులర్. ఆయనకు, మిగతా హీరోలతో చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్‌గా మీడియా ముందుకు రారు. ఇంటర్వ్యూలు వంటివి ఇవ్వరు. తన ప్రర్సనల్ లైఫ్ గురించి పెద్దగా చెప్పరు. ఒకప్పుడు ఖాళీ దొరికితే రేసింగ్ చేసేవారు. విదేశాల్లో బైక్ మీద కూడా తిరిగేవారు. కానీ, ఇప్పుడు ఖాళీ చేసుకుని మరీ కార్ రేసింగ్ చేస్తున్నారు. ఆయన మోటార్ కార్ రేసింగ్ మీద ఓ సినిమా రూపొందింది. అదే 'గ్లాడియేటర్స్ - ఇన్ పర్సూట్ ఆఫ్ ఛాలెంజెస్'. ఒక విధంగా డాక్యుమెంటరీ అనొచ్చు. ఆ ఫిల్మ్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు.

అజిత్ పుట్టినరోజుకు 'గ్లాడియేటర్స్' గ్లింప్స్‌Gladiators - In Pursuit of Challenges Glimpse Release: మే 1న అజిత్ కుమార్ పుట్టినరోజు. ఈ ఏడాది ఆయన 55వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అజిత్ బర్త్ డే స్పెషల్ కింద శుక్రవారం 'గ్లాడియేటర్స్ - ఇన్ పర్సూట్ ఆఫ్ ఛాలెంజెస్' ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు.

Also Read: Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

అజిత్ కుమార్ అంతర్జాతీయ రేసింగ్ కెరీర్‌ మీద 'గ్లాడియేటర్స్' తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఏషియన్ లే మాన్స్ సిరీస్, 24 హెచ్ సిరీస్‌లలో రేసింగ్ ఈవెంట్లలో ఆయన జర్నీని చూపించారు. ఈ గ్లింప్స్‌లో అజిత్ రేసింగ్ శిక్షణ, ఆయన టీంని చూపించారు. మలేషియా, యూరప్‌లోని వివిధ రేసింగ్ సర్క్యూట్‌లలో ఆయన పాల్గొన్న దృశ్యాలను చూపించారు.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

'గ్లాడియేటర్స్ - ఇన్ పర్సూట్ ఆఫ్ ఛాలెంజెస్'కి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా... జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. అజిత్ కుమార్ స్పోర్ట్స్ సర్వీసెస్ LLC ప్రొడ్యూస్ చేసింది. ఈ డాక్యుమెంటరీ నిడివి 90 నిమిషాలు. అంటే గంటన్నర. దీనిని డాక్యు ఫిల్మ్ లేదా ఫీచర్ ఫిల్మ్‌గా థియేటర్లలో విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. అజిత్ 56వ పుట్టినరోజు సందర్భంగా అంటే వచ్చే ఏడాది మే 1న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Also ReadGaayaPadda Simham Review - 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?