టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవాళ డిస్కషన్ పాయింట్ అంటే కన్నప్ప. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో అందరి చూపు దీని మీద పడింది. ప్రభాస్ క్యారెక్టర్ సూపర్ అంటూ ఆయన ఫ్యాన్స్, విష్ణు మంచు బాగా నటించారని ఆడియన్స్ అంటున్నారు. ఆఖరికి అన్న సినిమా చూసేందుకు తమ్ముడు మనోజ్ ఉదయం ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు వెళ్లారు. అయితే నిన్న ఆయన ఒక తప్పు చేశారు. అది లక్ష్మీ మంచు చేయలేదు.

శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే!'కన్నప్ప' విడుదల ముందు రోజు మనోజ్ ఒక ట్వీట్ చేశారు. అందులో మాట వరుసకు అయినా సరే విష్ణు మంచు ఊసు తీయలేదు. ఆయన ఫోటో కూడా షేర్ చేయలేదు. మోహన్ బాబు నుంచి సినిమాలో నటించిన స్టార్స్ అందరితో పాటు ఆఖరికి విష్ణు పిల్లల గురించి కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు. కానీ విష్ణు పేరు ఎత్తలేదు. లక్ష్మీ మంచు ఆ తప్పు చేయలేదు. 

''శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే'' అంటూ లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. విష్ణు ఫోటోతో కూడిన 'కన్నప్ప' స్టిల్ షేర్ చేశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులో విష్ణు పేరు తీయని మనోజ్, సినిమా చూసిన తర్వాత అన్న బాగా చేశాడని విష్ణుకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

Also Read: 'కన్నప్ప' రివ్యూ: 'బాహుబలి' రేంజ్‌లో ట్రై చేసిన విష్ణు మంచు... ప్రభాస్ క్యారెక్టర్ సూపర్, మరి సినిమా?

'కన్నప్ప'కు మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ... బాక్సాఫీస్ బరిలో బుకింగ్స్ చాలా బావున్నాయి. ఓపెనింగ్ డే రికార్డ్ కలెక్షన్ సాధించే అవకాశం కనబడుతోంది. విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ రికార్డ్ సాధిస్తుందని చెప్పవచ్చు.

Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో