రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. 'నా రోజా నువ్వే...' అంటూ సాగే గీతాన్ని కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆ పాటకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైంది. 


విజయ్... సమంత... ఆరాధ్య!
Kushi 2023 Movie Songs : 'ఖుషి'లో ఆరాధ్య అంటూ సాగే రెండో గీతాన్ని ఈ వారమే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సాంగ్ ప్రోమోను జూలై 10న (సోమవారం), ఫుల్ లిరికల్ వీడియోను జూలై 12న (బుధవారం) విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... హీరో హీరోయిన్లు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని లవ్లీగా కనిపించారు. 


ద్రాక్షారామం నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ!
'ఖుషి'కి శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఏపీలోని ద్రాక్షారామం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. అక్కడ చిత్రీకరణ ముగించుకుని శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. సమంత కూడా రిటర్న్ అవుతున్నట్లు తెలిసింది. 


Also Read : విజయ్ దేవరకొండను అమెరికా తీసుకు వెళుతున్న 'దిల్' రాజు, పరశురామ్!






మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా!
ఏపీలో జరిగిన 'ఖుషి' చిత్రీకరణలో మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా పాల్గొన్నారు. వాళ్ళిద్దరూ యాగం చేస్తుంటే... వెనుక విజయ్ దేవరకొండ, సమంత నిలబడి ఉన్నారు. ఈ వీడియో విజయ్ దేవరకొండ స్వయంగా పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'ది దేవరకొండ బ్రాడ్ కాస్ట్' ఛానల్ క్రియేట్ చేసిన ఆయన... అందులో ఈ వీడియో షేర్ చేశారు. ఇది 'ఖుషి' లాస్ట్ షెడ్యూల్ అని ఆయన పేర్కొన్నారు. 


Also Read : మనల్ని ఆపే మగాడు ఎవడు 'బ్రో' - పవన్ సినిమాలో ఫస్ట్ పాట


'ఖుషి' చిత్రానికి హేషామ్ అబ్దుల్ వాహాబ్ (hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. 'నా రోజా నువ్వే' పాటను కూడా ఆయనే పాడారు. పాన్ ఇండియా సినిమాగా 'ఖుషి' తెరకెక్కుతోంది.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.  


'ఖుషి'... సమంతకు పెళ్లైంది!
'ఖుషి'లోని కొన్ని సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ, సమంత భార్య భర్తలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సమంత 'ఖుషి' సెట్స్ నుంచి సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్టోరీలో పోస్ట్ చేశారు. అందులో ఆమె మెడలో నల్లపూసలు కనిపించాయి. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియోలో కూడా సేమ్ రెడ్ శారీలో సమంత కనిపించారు.


మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు 'ఖుషి'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.