Kurthi Thatha About His Arrest : సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్లందరికీ కుర్చీ తాత తెలిసే ఉంటుంది. 'కుర్చీ మడతపెట్టి' అనే ఒకే ఒక డైలాగ్ తో సోషల్ మీడియాని షేక్ చేశాడు కుర్చీ తాత. ఈయన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఈయన డైలాగ్ తో పాటని క్రియేట్ చేసేంతలా! త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ తర్వాత కుర్చీ తాత సెలబ్రిటీ అయిపోయాడు. గుంటూరు కారం సాంగ్ తన డైలాగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చి తాతను పిలిపించి మరి ఆర్థిక సాయం అందించారు.


సోషల్ మీడియాలో అలాంటి పాపులారిటీ తెచ్చుకున్నా కుర్చీ తాతను తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు ఈయన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కుర్చీ తాత తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని, తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయారని నోటికొచ్చినట్లు తిడుతున్నాడని, తన పేరు ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని, అతను కనిపిస్తే, చంపేస్తా అంటూ బెదిరిస్తూ వీడియోలు షేర్ చేయడంతో వైజాగ్ సత్య కుర్చీ తాతపై కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు హైదరాబాద్‌లోని KBR పార్కు వద్ద కుర్చీ తాతను అరెస్ట్ చేశారు. అయితే తాజాగా కుర్చీ తాత తన అరెస్టుకి గల కారణాలను స్వయంగా వెల్లడించారు.


ఓ ప్రముఖ ఛానల్ తనకు మద్యం తాగిపించి వైజాగ్ సత్య గురించి కావాలని అలా మాట్లాడించారని కుర్చీ తాత అన్నారు. "ఆ ఛానల్ వాళ్ళు నాకు మద్యం తాగిపించి అన్యాయంగా వైజాగ్ సత్యను కించపరిచే విధంగా మాట్లాడించారు. అతను నా కొడుకుతో సమానం. నన్ను అన్ని విధాలుగా ఆదుకున్నాడు. అతను చాలా మంచి వాడు. అలాంటి వ్యక్తిని బ్లేమ్ చేసి మాట్లాడడం ధర్మం కాదు. అతనికి ఇతరులకు సాయం చేసే గుణం ఉంది. అతనితో నేను వైజాగ్ వెళుతున్నా. కొద్ది రోజులు అక్కడే రిలాక్స్ అయి వస్తా. వైజాగ్ సత్య చాలా మంచి మనిషి. దీన్ని ఎవరు తప్పు పట్టకండి" అంటూ చెప్పుకొచ్చాడు.


దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఉంటాడు. ఇతనికి భార్య, కొడుకులు, కూతురు ఉన్నారు. అయితే ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతూ ఉంటాడు. అయితే మధ్యలో యూట్యూబ్ ఛానల్లో ఈయన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో వాడిన 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ సోషల్ మీడియా అంతటా పాపులర్ అవడంతో ఈయన పేరు కూడా 'కుర్చీ తాత' గా మారిపోయింది.


Also Read : నితిన్ - వెంకీ కుడుముల సినిమాకి పవర్ ఫుల్ టైటిల్!