Nagarjuna's Kuberaa Pre Release Event New Schedule: నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించాల్సి ఉండగా.. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనతో వాయిదా వేశారు. ఈ ప్రమాదంపై మూవీ టీం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా.. ఈవెంట్ నిర్వహించే కొత్త తేదీని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈవెంట్ ఎప్పుడంటే?

ఈ నెల 15న (ఆదివారం) 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. సేమ్ వెన్యూ, సేమ్ టైంలోనే ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపింది. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీని భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీలో ధనుష్, నాగార్జున, రష్మికలతో పాటు జిమ్ సర్బ్, ప్రియాంశు ఛటర్జీ, దలీప్ తాహిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాలో ధనుష్ ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో బిచ్చగాడి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుండగా.. నాగార్జున ఈడీ అధికారి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్, స్పెషల్ వీడియోస్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. 'లవ్ స్టోరీ' తర్వాత భిన్నమైన సోషల్ డ్రామాతో శేఖర్ కమ్ముల వస్తుండగా.. మూవీ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది.

Also Read: ఎవరీ క్లైవ్ కుందర్? అహ్మదాబాద్ ఫ్లైట్‌లోని కో పైలట్ '12th ఫెయిల్' హీరో విక్రాంత్ బ్రదర్ / కజిక్ కాదు... మరి?

మరోవైపు.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ ట్రైలర్ రిలీజ్ కూడా వాయిదా పడింది. విమాన ప్రమాద ఘటనతో ఇండోర్‌లో జరగాల్సిన ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేశారు. ఈ వేడుక శుక్రవారం నిర్వహించాల్సి ఉండగా పోస్ట్ పోన్ చేశారు. త్వరలోనే కొత్త తేదీలు వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ సహా ఇతర ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.