విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi). దర్శకుడిగా పరిచయమైన 'గమ్యం' నుంచి 'ఘాటి' వరకు... కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే? ఫిల్మ్ జానర్ వేరైనా సరే, ప్రతి సినిమాలోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. డిఫరెంట్ కథతో వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకుల - విమర్శకుల మనసులు గెలుచుకున్నారు క్రిష్. అటువంటి కథతో కొత్త సినిమా ప్రారంభించడానికి ఆయన రెడీ అయ్యారు. 

Continues below advertisement

మార్చి 19న పూజతో క్రిష్ కొత్త సినిమా షురూ!Krish Jagarlamudi next movie after Ghaati: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఘాటి'. ఆశించిన విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత ప్రేక్షకులు తన నుంచి ఆశించే కథను క్రిష్ జాగర్లమూడి సిద్ధం చేశారని తెలిసింది. 

Also ReadBalakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

Continues below advertisement

క్రిష్ కొత్త సినిమా మార్చి 19న పూజతో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆ మర్నాడు... అంటే మార్చి 20న చిత్ర బృందం అంతా వెస్ట్‌ బెంగాల్ (డార్జిలింగ్) ప్రయాణం కానుంది. హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

హీరోలతో పాటు స్టోరీ విషయంలో సస్పెన్స్!ట్రెక్కింగ్ బ్యాక్‌డ్రాప్‌లో క్రిష్ కథ రాశారని, ఆ కథతో కొత్త సినిమాను తీయబోతున్నారని, అందులో ఏడుగురు హీరోలు ఉంటారని ఆ మధ్య వార్తలు రాగా... క్రిష్ ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని ట్వీట్ చేశారు. అయితే... చిత్ర బృందం సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, బ్యాక్‌డ్రాప్ ట్రెక్కింగే కానీ హీరోలు ఎవరనేది క్రిష్ సస్పెన్స్‌లో ఉంచారని సమాచారం. ఈ సినిమాను క్రిష్ సన్నిహిత మిత్రుడు రాజీవ్ రెడ్డి, ఆయన తండ్రి సాయిబాబా జాగర్లమూడి ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు పూజ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా