Kothapallilo Okappudu Movie OTT Release Date: రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్‌కు ఉండే క్రేజ్ వేరు. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి మూవీస్ ఆ జాన‌ర్‌లోకే చెందుతాయి. ఈ మూవీస్ నిర్మించిన ప్రవీణ పరుచూరి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' మూవీతో దర్శకురాలిగా మారారు. జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా... ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ఈ నెల 22 నుంచి ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. 'రామకృష్ణ ప్రయాణం మనోహరమైనది, అస్తవ్యస్తమైనది, పూర్తిగా మరపురానిది' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మూవీలో మనోజ్ చంద్ర హీరోగా పరిచయం కాగా... మౌనిక హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే రవీంద్ర విజయ్, బెనర్జీ, ఉషా, అభిరామ్ మహంకాళి, ప్రేమ్ సాగర్, షైనింగ్ ఫణి కీలక పాత్రలు పోషించారు. దగ్గుబాటి రానా సమర్పణలో ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించారు. 

Also Read: గ్రామంలో అమ్మాయిలు మిస్సింగ్ - జింక అనుకునే సింహం ఏం చేసిందంటే?... 'కానిస్టేబుల్ కనకం' ట్రైలర్ వేరే లెవల్

స్టోరీ ఏంటంటే?

కొత్తపల్లి అనే ఊరిలో అప్పన్న (రవీంద్ర విజయ్) ఊరంతటికీ అప్పులిస్తూ వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటుంటాడు. ఇతని దగ్గరే రామకృష్ణ (మనోజ్ చంద్ర) పని చేస్తుంటాడు. ఇక ఇదే ఊరి జమీందార్ రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రిని (మోనికా) చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాడు రామకృష్ణ. అప్పన్న దగ్గర పని చేయడమే కాకుండా అప్పుడప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయిస్తుంటాడు. ఓసారి సావిత్రితో పక్క ఊరిలో డ్యాన్స్ చేయించాలనుకుంటాడు. నేరుగా ఆమెను అడగాలంటే ధైర్యం చాలదు.

దీంతో సావిత్రి ఇంట్లో పని చేసే అందం అలియాస్ ఆదిలక్ష్మి (ఉషా) సాయం తీసుకుంటాడు. అయితే, అనుకోని ఘటనలతో ఆదిలక్ష్మిని రామకృష్ణ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ముహూర్తానికి కొన్ని క్షణాల ముందే అప్పన్న వల్ల ఈ పెళ్లి ఆగుతుంది. అసలు అతను ఏం చేశాడు? అప్పన్న, రెడ్డికి మధ్య శత్రుత్వం ఎందుకు వచ్చింది? సావిత్రి ప్రేమను రామకృష్ణ దక్కించుకోగలడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.