కోలీవుడ్ హీరో కార్తీ డిఫరెంట్ జానెర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే తమిళంలో భారీ స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరోకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. కార్తీ నటించే సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలై మంచి విజయాలు అందుకుంటున్నాయి. గత ఏడాది 'సర్దార్' 'పొన్ని యన్ సెల్వన్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న కార్తి ప్రస్తుతం 'జపాన్'(Japan అనే సినిమాలో నటిస్తున్నాడు. రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా ఇప్పుడు ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ ను రిలీజ్ చేశారు.


సినిమాలో కార్తీక్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని పోస్టర్ ద్వారానే అర్థమైంది. ఇక ఇప్పుడు టీజర్ లో కార్తీ నేషనల్ లెవెల్ దొంగగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్ ని పరిశీలిస్తే.. సిటీలో ఓ గోల్డ్ షాప్ లో రూ.200 కోట్ల విలువైన నగలను ఎత్తుకుపోయిన దొంగ ఎవరు అనే పాయింట్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాల పోలీసులను జపాన్ గా కార్తీ ముప్పుతిప్పులు పెట్టబోతున్నట్లు చూపించారు. అంతేకాదు పోలీసులు అతన్ని చాలా సీరియస్ గా రీసెర్చ్ చేసి మరి వెతుకుతున్నట్లు టీజర్ లో కనిపించడంతో ఇందులో పోలీసులకు, కార్తీ కి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది.


'ఈ దొంగతనం స్టైల్ చూస్తే జపాన్ లానే అనిపిస్తుంది' అని టీజర్ లో వచ్చిన వాయిస్ ను బట్టి చూస్తే సినిమాలో కార్తీ దొంగతనం చేయడంలో ఓ స్టైల్ ఫాలో అవుతాడని చెప్పొచ్చు. అలాగే 'జపాన్ మీద 152 కేసులు ఉన్నాయని పోలీస్ అధికారులు చెప్పడం, నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడిని వెతుకుతున్నారు. కానీ ఒక్కసారి కూడా దొరకలేదనే' డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక టీజర్ లో జపాన్ క్యారెక్టర్ లో కార్తి డిఫరెంట్ మేకవర్లో అల్ట్రా స్టైలిష్ గా కనిపించి ఆకట్టుకున్నారు. టీజర్ చివర్లో 'రేయ్ ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ ని ఏం పీకలేరు రా?' అంటూ కార్తి చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


'జపాన్' టీజర్ లో ఉన్న కంటెంట్ చూస్తుంటే కార్తికి మరో హిట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. అయితే టీజర్ లో జపాన్ దొంగతనాలు చేసిన తర్వాత అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. జపాన్ రేంజ్ వేర్ అంటూ అతను ఎక్కువగా గోల్డ్ తోనే కనెక్ట్ అయ్యేలా చూపించారు. కార్తీ పెట్టుకున్న కళ్ళజోడు నుంచి నోటి పన్ను వరకు కూడా గోల్డ్ తోనే ఉంటుంది. అసలు జపాన్ గోల్డ్ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? అతన్ని పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నాడు? దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : జనం మధ్య జగన్ - 'యాత్ర 2' నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్, పాత్రలో లీనమైన జీవ






Join Us on Telegram: https://t.me/abpdesamofficial