Karthi About Movie With Ravi Mohan In Multi Starrer: కోలీవుడ్ స్టార్స్ రవి మోహన్, కార్తీ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హీరో కార్తీ... తాజాగా చెన్నైలో జరిగిన 'రవిమోహన్ స్టూడియోస్' నిర్మాణ సంస్థ ప్రారంభ వేడుకలో హింట్ ఇచ్చారు. రవి మోహన్ చెప్పిన స్టోరీ తనకు చాలా బాగా నచ్చిందని... త్వరలోనే ఇద్దరం కలిసి ఓ మూవీ చేయబోతున్నట్లు చెప్పారు.

డైరెక్టర్ ఎవరంటే?

ఈ అప్ కమింగ్ ప్రాజెక్టుకు రవి మోహన్ దర్శకత్వం వహించనున్నట్లు కార్తి చెప్పారు. 'చాలా రోజుల క్రితం రవి మోహన్ నాకు ఓ స్టోరీ చెప్పారు. అది ఓ మల్టీ స్టారర్. నేను ఆయన హీరోలుగా ఉంటాం. రవి స్క్రిప్ట్ చెబుతున్న టైంలోనే నటిస్తూ నెరేషన్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఆయన దర్శకత్వం వహించే మూవీ కోసం కలిసి వస్తున్నాం. ఆయన చెప్పిన స్టోరీ జిమ్ క్యారీని గుర్తు చేసింది.' అంటూ వెల్లడించారు. గతంలో వీరిద్దరూ కలిసి 'పొన్నియన్ సెల్వన్' మూవీలో నటించగా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇద్దరు స్టార్లు కలిసి వస్తుండడంతో హైప్ క్రియేట్ అవుతోంది.

Also Read: రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ సాంగ్ రిలీజ్... కాలేజీ ప్రేమకథలో ఏం జరుగుతోంది?

తలైవా సజిషన్... నిర్మాతగా మారను

ఇక తాను ఎప్పటికీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కార్తి. ఈ విషయంపై సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడో తనకు సలహా ఇచ్చారని... నిర్మాతగా అసలు ఎప్పటికీ మారనని అన్నారు.

మాజీ భార్య ఆర్తి రవితో విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడంతో ఇటీవల వార్తల్లో నిలిచారు కోలీవుడ్ స్టార్ రవి మోహన్. తాజాగా తన కెరీర్‌లో మరో ముందడుగు వేశారు. 'రవిమోహన్ స్టూడియోస్' పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించగా... చెన్నైలో ఈ వేడుక ఘనంగా సాగింది. రెండు కొత్త చిత్రాలతో సంస్థ ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌కు సింగర్ కెనీషాతో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తమిళ హీరోలు కార్తితో పాటు శివకార్తికేయన్ సూర్య, అథర్వ, జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్, దర్శకురాలు సుధా కొంగరతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా తన తల్లిని సన్మానించిన రవి మోహన్ వేదికపై ఎమోషనల్ అయ్యారు. తన కుమారుని గురించి చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకోగా ఆయన కింద కూర్చుని ఆమెను ఓదార్చారు. తన తల్లితో బెస్ట్ మూమెంట్‌ను ఫ్రేమ్‌గా కట్టించి ఆమెకు గిఫ్ట్ ఇచ్చారు. ఈ సమయంలో వేదికపై ఆయన ప్రియురాలు సింగర్ కెనీషా సైతం ఉన్నారు.