నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కాలేజీలో చేరారు. నిజ జీవితంలో కాదులెండి... రీల్ లైఫ్‌లో! హీరో నుంచి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ గుర్తు ఉన్నారుగా! ఆయన దర్శకత్వంలో రష్మిక నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend Movie). అందులో ఆవిడ కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి పాట 'ఏం జరుగుతోంది' (Em Jaruguthondhi Song) విడుదలైంది.

కాలేజీలో చక్కటి ప్రేమ గీతం...వాళ్ళిద్దరి అనుబంధం చూపేలా!'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో రష్మిక సరసన 'దసరా' ఫేమ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలపై తెరకెక్కుతున్న చిత్రమిది. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. పాన్ ఇండియా రిలీజ్ కోసం రెడీ చేస్తున్న చిత్రమిది. ఐదు భాషల్లో 'ఏం జరుగుతోంది' పాటను విడుదల చేశారు.

Also Read: 'సుందరకాండ' ఫస్ట్ రివ్యూ: ఇంటర్వెల్ మెయిన్ హైలైట్... రోహిత్ నటన, కామెడీ సూపర్బ్ - 'సోలో' హీరోగా హిట్ వచ్చినట్టేనా!?

కాలేజీలో అబ్బాయి, అమ్మాయి మధ్య అందమైన ప్రేమకథను 'ఏం జరుగుతోంది...' పాటలో ఆవిష్కరించారు. బాయ్ ఫ్రెండ్ బర్త్ డే హీరోయిన్ సెలబ్రేట్ చేయడం నుంచి హీరో హీరోయిన్ల మధ్య స్నేహాన్ని రాహుల్ రవీంద్రన్ చక్కగా ఆవిష్కరించారు. 

'ఏం జరుగుతోంది...' పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించారు. తమిళంలో కూడా ఆయన రాశారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ చార్ట్ బస్టర్ ట్యూన్ అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ... ఐదు భాషల్లోనూ ప్రముఖ గాయని చిన్మయి పాడారు. త్వరలో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు.

Also Readఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై నారా రోహిత్ రియాక్షన్ అదేనా? సింపుల్‌గా హర్ట్‌ చేయకుండా చెప్పేశారా?