Leap Day 2024 Celebrity Birthdays: ప్రతి ఒక్కరు ఏడాదికి ఒకసారి బర్త్ డే జరుపుకుంటారు. సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల వరకు ధూంధాంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సినీ తారల బర్త్ డే వచ్చిందంటే, వారి అభిమానులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ, ఫిబ్రవరి 29న జన్మించడం అంటే వెరీ వెరీ స్పెషల్. నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తోంది. అలాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు.


ఫిబ్రవరి 29న పుట్టిన సెలబ్రిటీలు


అయితే, ఫిబ్రవరి 29 నాడు పలువురు సెలబ్రిటీలు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. వారు కూడా నాలుగు సంవత్సరాలకు ఓసారి అట్టహాసంగా బర్త్ డే వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


1. జా రూల్- రాపర్


జెఫ్రీ బ్రూస్ అట్కిన్స్ సీనియర్. ప్రముఖ అమెరికన్ రాపర్. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత అతడి పేరు జా రూల్ గా మార్చుకున్నారు. ఫిబ్రవరి 29, 1976లో న్యూయార్క్ లో పుట్టి పెరిగిన ఆయన, 2000 సంవత్సరం తర్వాత ర్యాప్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యాడు. పాటల రచయితగా, నటుడిగానూ జా రూల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


2. రాఖీ థక్రార్, నటి


హాలీవుడ్ నటి రాఖీ థక్రార్ కూడా ఫిబ్రవరి 29న జన్మించింది.  ఆమె BBC ‘వన్ సోప్ ఒపెరా ఈస్ట్‌ ఎండర్స్’, నెట్‌ఫ్లిక్స్ కామెడీ-డ్రామా ‘సెక్స్ ఎడ్యుకేషన్’లో ప్రధాన పాత్రలు పోషించి బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు సిరీస్ లలో నటిస్తూ ఆకట్టుకుంటోంది.  


3. ఖలేద్- గాయకుడు


అల్జీరియాలోని ఓరాన్‌లో ఫిబ్రవరి 29, 1960న ఖలీద్ జన్మించారు. చిన్నతనం నుంచే గిటార్, బాస్, అకార్డియన్ హార్మోనియం వాయించేవాడు. మొరాకో మ్యూజిక్ ప్రపంచంలో దిగ్గజ గాయకుడిగా ఎదిగాడు.   


4. జాన్వీ చేదా, నటి


ఇండియన్ నటి జాన్వీ చేదా కూడా ఫిబ్రవరి 29నే జన్మించింది. టెలివిజన్ రంగంలో స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఛూనా హై ఆస్మాన్‌’, ‘బాలికా వధు’, ‘సీఐడీ’ సీరియల్స్‌తో బాగా గుర్తింపు తెచ్చుకుంది.   


5. ఆడమ్ ఆంటోనీ సింక్లైర్, భారత హాకీ ఆటగాడు


ఇండియన్ హాకీ ప్లేయర్ ఆడమ్ ఆంటోనీ సింక్లైర్ సైతం ఫిబ్రవరి 29నే జన్మించాడు. తమిళనాడుకు చెందిన ఇతడు ఇండియా జట్టులో ఆడాడు. ఏథెన్స్‌ లో జరిగిన 2004 ఒలింపిక్స్‌ తోపాటు దోహాలో జరిగిన 2006 ఆసియా క్రీడలలో పాల్గొన్నాడు.


అటు ప్రముఖ టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ మోడల్ లీనా గెర్కే, నటుడు  జెస్సీ టి అషర్, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్, ఒలింపిక్ స్విమ్మర్ కల్లెన్ ఆండ్రూ జోన్స్, మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ కూడా ఫిబ్రవరి 29నే జన్మించారు.


Read Also : సూపర్ స్టార్ లవ్ స్టోరీ : రజనీకాంత్ మామోలోడు కాదు, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయినే పడేశాడు - ఆ బంధానికి 43 ఏళ్లు !