Kiran Abbavaram K RAMP Trailer Out Now: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా లేటెస్ట్ మాస్ కామెడీ ఎంటర్‌టైనర్ కె ర్యాంప్. ఈ మూవీ టైటిల్, టీజర్ ఇప్పటికే ట్రెండింగ్‌గా నిలిచాయి. ముద్దులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కాస్త రచ్చ అనిపించినా... యూత్‌కు ఎంటర్‌టైనింగ్‌గా అనిపించాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
మూవీలో 'రిచ్చెస్ట్ చిల్లర్ గయ్'గా కుమార్ పాత్రలో సందడి చేశారు కిరణ్. కేరళ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తుండగా... హీరో హీరోయిన్ల మధ్య లవ్, ఆ తర్వాత అలకలు, గొడవలు బ్యాక్ డ్రాప్‌గా కామెడీ మాస్ అంశాలు కలగలిపి మూవీని తెరకెక్కిచినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
తనదైన డైలాగ్స్, కామెడీ పంచెస్‍తో కిరణ్ అబ్బవరం అదరగొట్టారు. మాస్ యాక్షన్, గొడవలు, లవ్, అలకలు, కాలేజీ సరదాలు అన్నింటినీ మిక్స్ చేసి మూవీని రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. హాస్పిటల్‌లో బయట కూర్చుని హీరో కిరణ్ కాళ్లు ఊపుతుండగా... పక్కనే ఉన్న బామ్మ.. 'కాళ్లు ఊపకూడదమ్మా దరిద్రం' అని చెప్తుంది. 'నేను ఊపట్లేదు బామ్మ. నా గర్ల్ ఫ్రెండ్‌ను తలుచుకుంటే వాటంతట అవే ఊగుతున్నాయి.' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తిని పెంచేస్తోంది.
ఓ రిచ్చెస్ట్ పర్సన్ కొడుకు కేరళలో కాలేజీలో జాయిన్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తుండగా అక్కడ పరిచయం అయిన అమ్మాయి మెస్సీతో ప్రేమలో పడతాడు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, ముద్దు సీన్స్ యూత్‌కు కనెక్ట్ అవుతాయి. లవ్ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగింది? హీరో లైఫ్‌లో జరిగిన ట్విస్టులు, వీరి లవ్ ఏమైంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తుండగా... ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. కిరణ్ అబ్బవరం సరసన చెన్నై బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే నరేష్, సాయి కుమార్, వెన్నెల కిశోర్, మురళీ ధర్ గౌడ్, అలీ, శివన్నారాయణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ నెల 18న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'మిత్ర మండలి' సెన్సార్ రివ్యూ - కామెడీ ఎంటర్‌టైనర్ ఆడియన్స్‌ను మెప్పిస్తుందా?