Kiran Abbavaram About Siddharth  Roy Movie: 'అతడు' చైల్డ్‌ ఆర్టిస్ట్ దీపక్‌ సరోజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా 'సిద్ధార్థ్‌ రాయ్‌'. బోల్డ్‌ కంటెంట్‌తో వస్తున్న మూవీ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్‌. ఈ ఈవెంట్‌కు యంగ్‌ టాలెంటెడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ఈ స్టేజ్‌ తనకు చాలా స్పెషల్‌ అని చెప్పాడు. ఇక్కడికి వచ్చినప్పడల్లా స్పెషల్‌ ఫీలింగ్ ఉంటుందని, 2016 నుంచి 2019 వరకు ఎన్నో షార్ట్స్‌ ఫిలింస్‌ ఈ స్టేజ్‌పైనే ప్రీమియర్‌ చేశామన్నాడు. అందుకే ఈ స్టేజ్‌ తనకు చాలా స్పెషల్‌ అంటూ నాటి సంగతులును గుర్తు చేసుకున్నాడు.


అనంతరం 'సిద్ధార్థ్‌ రాయ్‌' మూవీ గురించి మాట్లాడాడు. ఈ మూవీ గురించి విన్నానని, డైరెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ తీసుకున్నారన్నాడు. "మూడేళ్లుగా సిద్ధార్థ్‌ రాయ్‌ సినిమా కోసం కష్టపడ్డారు. ఈ స్టోరీ లైన్‌ నాకు తెలుసు. చాలా ఇంటెన్స్‌గా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా" అన్నాడు.  అలాగే ఈ మూవీ హీరో దీపక్‌ సరోజ్‌ గురించి మాట్లాడాడు. "దీపిక్‌.. అతడు సినిమాలో అదేదో ట్రైన్‌, బొమ్మలతో ఆడుకున్నట్టు ఇక్కడ ఏదేదో ఆడుకున్నాడు. కానీ ఫస్ట్‌ సినిమాతోనే చాలా డేర్‌ స్టెప్‌ వేశాడు. ఇలాంటి కథ చేయాలంటే ధైర్యం ఉండాలి. నేను అయితే భయపడి పారిపోయేవాడిని. 'చాలా ఇంటెన్సీవ్‌గా చేశావు. ఫస్ట్‌ మూవీలోనే అన్ని ఎమోషన్స్‌ చూపించడమంటే చిన్న విషయం కాదు. చాలా బాగా చేశాడు. ఈ సినిమా పట్ల కూడా దీప్‌ చాలా కాన్ఫీడెంట్‌గా ఉన్నాడు.


అతడి మాటల్లో అది గమనించాను. నాతో కూడా ఈ మూవీ పట్ల చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. ఫస్ట్‌ సినిమాతోనే ఇలాంటి అన్ని ఎమోషన్స్‌ చూపించే మూవీ దొరకడం చాలా సంతోషంగా ఉందన్నాడు' అని పేర్కొన్నాడు. ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే ఇలాంటి ఒక సినిమా తీయడమనేది నిజంగా సెలెబ్రేట్‌ చేసుకునే విషయం. రేపు సాయంత్రం మూవీ టీం అంతా మళ్లీ ఇక్కడకు వచ్చి సినిమాను సెలబ్రేట్‌ చేసుకోవాలి" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కాగా 'సిద్ధార్థ్‌ రాయ్‌' ట్రైలర్‌ చూసిన ఆడియన్స్‌ అంతా మరో అర్జున్‌ రెడ్డి సినిమా అంటున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ నుంచి భారీ రెస్పాన్స్‌ అందుకుంది. ట్రైలర్‌ మొత్తం బోల్డ్ సీన్లతో నిండిపోయింది.


Also Read: ఓ రేంజ్‌లో గ్లామర్‌ షో - 'టిల్లు స్క్వేర్‌'కు అనుపమ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?


“నాలాంటి ప్రేమ డిఫరెంట్”,“వర్జినిటీని 17 సంవత్సరాలకు కోల్పోయా”, “నేను లవ్ కోసం కాదు.. లవ్ మేకింగ్ కోసం” అంటూ హీరో  చెప్పే డైలాగ్స్ మూవీ ఆసక్తిని పెంచాయి. చూస్తుంటే ఈ మూవీ బోల్డ్ కంటెంట్ తో ఉండబోతుందని అర్థమైపోతుంది. అమ్మాయిని సిగరెట్ ఉందా? లేదంటే కండోమ్ ఉందా? అంటూ అడగడం చూస్తుంటే అర్జున్‌ రెడ్డి మూవే గుర్తొచ్చిందంటున్నారు. మూవీలో లిప్ లాక్ సన్నివేశాలకు కొదువలేదనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో దీపక్‌ సరోజీ సరసన తన్వి నేగీ హీరోయిన్‌గా నటించింది. ఆనంద్, కల్యాణి నటరాజ్, మాథ్యూ వర్గీస్, నందినీ, కీర్తన కీలకపాత్రలు చేశారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్, విహిన్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జయ అడపాక ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధనే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.