Kamal Haasan about thalapathy Vijay's political entry : తమిళ హీరో తలపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల్లో సైతం విజయ్‌ పోటీ చేయనున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అభిమానులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సైతం దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై కమల్ హాసన్ కామెంట్స్


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ ని విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఇందుకు కమల్ బదులిస్తూ.. "విజయ్‌కు శుభాకాంక్షలు.. అతను పాలిటిక్స్ లోకి రావాలని ఎంకరేజ్ చేసిన వారిలో నేను ఒకడిని. మేము వీటి గురించి డిస్కస్ కూడా చేసుకున్నాం. ఓ రంగంలో కొనసాగాలంటే మరో రంగాన్ని విడిచి పెట్టాలని లేదు. రాజకీయాలా? సినిమాలా? అన్నది విజయ్ వ్యక్తిగత అభిప్రాయం. అతను చేసే సినిమాలు విభిన్నంగా ఉంటాయి. నన్ను అలా చేయమంటే ఎలా? అద్భుతమైన పాటలు రాసే ఓ రచయితలా మీరు పాట రాయండి అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఎవరి సామర్థ్యం వారిది. నేనైతే రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.


వరుస సినిమాలతో బిజీ బిజీ


'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'ఇండియన్ 2', 'థగ్ లైఫ్', KH237 వంటి సినిమాలతో పాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్ 'కల్కి2898AD'లో విలన్ గా కనిపించనున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాత గానూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలో ఇప్పటికే శివ కార్తికేయన్ హీరోగా 'అమరన్' సినిమా రూపొందుతోంది. దీంతోపాటు శింబుతో మరో సినిమాను నిర్మిస్తున్నారు.


జూన్‌లో రానున్న 'గోట్' 


గత ఏడాది 'లియో' మూవీతో భారీ సక్సెస్ అందుకున్న తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ (Greatest Of All Time) సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. తండ్రికి జరిగిన అన్యాయాన్ని ట్రైం ట్రావెల్‌ చేసి హీరో ఎలా పగ తీర్చుకుంటాడనేది ఈ కథ అని తెలుస్తోంది. జయరాం, మిక్ మోహన్, ప్రభు దేవ, యోగిబాబు కీరోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది జూన్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Also Read : యాక్షన్ మోడ్‌లో రామ్ చరణ్ - రామోజీ ఫిల్మ్ సిటీలో 'గేమ్ ఛేంజర్' నయా షెడ్యూల్!