KGF Hero Yash Cameo in Salaar : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' ( Salaar ) రిలీజ్ దగ్గర పడుతుండడంతో సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల మూవీ టీమ్ ట్రైలర్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్లు ట్రైలర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'సలార్' ట్రైలర్ ( Salaar Trailer ) డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. మరోవైపు గత కొద్ది రోజులుగా 'సలార్' మూవీకి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంది.


ఈ క్రమంలోనే తాజాగా 'సలార్'కి సంబంధించి మరో న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే ‘సలార్’లో ప్రభాస్‌తో పాటు మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ చేస్తున్నారట. ఆ స్టార్ హీరో ఎవరు? డీటెయిల్స్ లోకి వెళ్తే.. భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇతర అగ్ర హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్(Bollywood)లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్ సినిమాల్లో ఎక్కువగా నడుస్తుంది. మూవీ రిలీజ్ కి ముందే ఫలానా హీరో గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ పెంచేస్తున్నారు. దీంతో ఆ హీరో ఫ్యాన్స్ అంతా నిజంగానే సినిమాలో ఎక్కడ కనిపిస్తాడనే ఆశతో థియేటర్స్ కి పరుగులు పెడుతుంటారు.


రీసెంట్ గా సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన 'టైగర్ 3'(Tiger 3) లో ఎన్టీఆర్(NTR) గెస్ట్ అప్పీరియన్స్ ఉంటుందని ప్రచారం జరిగింది. దానికంటే ముందు లోకేష్ కనగరాజ్ 'లియో'(Leo) మూవీలో రామ్ చరణ్ (Ram Charan) క్లైమాక్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు న్యూస్ వచ్చింది. కానీ అవేవీ జరగలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ మూవీలోనూ ఓ అగ్ర హీరో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు 'కేజీఎఫ్' హీరో యశ్(KGF Hero Yash). ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' లో కేజీఎఫ్ హీరో యశ్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కన్నడ మీడియా వర్గాల్లో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.


సలార్ లో యశ్ క్యామియో ఉండబోతుందని చెబుతున్నారు. 'సలార్' మూవీని ప్రశాంత్ మల్టీవర్స్ తరహాలో తెరపైకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే టాక్ వినిపించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ చూస్తే 'కేజిఎఫ్' మూవీకి సలార్ లింక్ అయి ఉందని అందరూ అనుకుంటున్నారు. వీటన్నింటినీ బట్టి చూస్తే సలార్ లో యశ్ గెస్ట్ రోల్ నిజమే అయ్యుంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమై, ప్రభాస్, యశ్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్స్ లో గూస్ బంప్స్ గ్యారంటీ అని చెప్పొచ్చు.


మరి నిజంగానే సలార్ లో యశ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడా? డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ మూవీని 'కేజిఎఫ్' తో లింక్ పెట్టాడా? అనేది తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నాడు. హోంబలే ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : ‘అన్ స్థాపబుల్’ షోకు ‘యానిమల్’ హీరో, నెట్టింట్లో బాలయ్య-రణబీర్ ఫోటో వైరల్