Keerthy Suresh About Anil Ravipudi Venkatesh Movie : స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్ రామ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న మూవీ 'VenkyAnil5' (వర్కింగ్ టైటిల్). ఈ ఏడాది 'మన శంకర వరప్రసాద్ గారు'తో బిగ్ సక్సెస్ అందుకున్న అనిల్... వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ మలయాళ సినిమాకు రీమేక్ అంటూ సాగుతున్న ప్రచారంపై హీరోయిన్ కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చారు.

Continues below advertisement

'అది నిజం కాదు'

వెంకీ అనిల్ మూవీపై తాజాగా ఓ ఇన్ స్టా పేజ్ రీమేక్ అంటూ ప్రచారం చేసింది. ఈ సినిమా 2024లో రిలీజైన మలయాళ కామెడీ ఎంటర్టైనర్ 'గురువాయూర్ అంబలనాదయిల్'కు రీమేక్‌గా రాబోతోందంటూ పోస్ట్ చేసింది. దీనికి కీర్తి సురేశ్ రియాక్ట్ అయ్యారు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో రీమేక్ రూమర్స్‌కు చెక్ పడింది.

Continues below advertisement

Also Read : Sing Geetham OTT : సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ - థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వెరైటీగా ప్రమోషన్స్

ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచీ షూటింగ్ స్టార్ట్ అయ్యే మూమెంట్ వరకూ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన శైలిలో ప్రమోషన్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌తో పాటు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్‌ను బీచ్‌లోని ఇసుకలో పాతేసి ఫన్ చేశారు. ఆ తర్వాత వెంకీ, కల్యాణ్ రామ్‌లతో కత్తితో వీర తిలకం దిద్ది ఫన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

వెంకీ అనిల్ కాంబోలో ఇది ఐదో మూవీ కాగా... కల్యాణ్ రామ్‌తో ఆయనకు రెండో మూవీ. గతంలో వెంకీతో చేసిన F2, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కూడా అదే రిజల్డ్ రిపీట్ అవుతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్యాణ్ రామ్‌తో పటాస్ మూవీ తీశారు అనిల్. ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బిగ్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ముగ్గురి కాంబోలో సినిమా వస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

సినిమాలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా... జీ స్టూడియోస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో మాస్, యాక్షన్ అంశాలతో తనదైన కామెడీ స్టైల్ స్టోరీలో చూపించనున్నట్లు అర్థమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Transfer Trimurthulu OTT : ఓటీటీలోకి వడ్డే నవీన్ కమ్ హ్యాక్ మూవీ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.