యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda)కు జోడీగా 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) నటించిన సినిమా 'బెదురులంక 2012'. యుగాంతం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. దీని ద్వారా ప్రేక్షకులను కావాల్సినంత వినోదాన్ని అందిస్తానని ఏబీపీ దేశానికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు హీరో కార్తికేయ. 


ఇటీవల 'బెదురులంక 2012' ట్రైలర్ విడుదలైంది. అందులో ఎండింగ్ డైలాగ్ విన్నారా? ఆ సీన్ చూశారా? 'ది శివశంకర వరప్రసాద్ షో బిగిన్స్' అని కార్తికేయ చెప్పారు. ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే... చిరంజీవి తరహాలో ఉంటుంది. ఈ నెల 25న థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న ఈ చిత్రంలో... తన పాత్రకు పెట్టిన పేరు, షూటింగ్ సంగతులను షేర్ చేసుకున్నారు. 


'బెదురులంక' అనే గ్రామంలో 2012 సమయంలో చెలరేగిన పుకార్లు, అక్కడి ప్రజలు భయపడిన విధానం, ఇంకా అటువంటి పరిస్థితులను సొమ్ము చేసుకోవాలని ట్రై చేసే కేటుగాళ్లను ఎదిరించే శివ అనే యువకుడిగా నటిస్తున్నట్లు చెప్పారు కార్తికేయ. హేతువాదిగా, మూఢనమ్మకాలు నమ్మని వ్యక్తిగా, ఆత్మవిశ్వాసం, ఆటిట్యూడ్ తో ఉండే ఈ పాత్రకు మొదట నుంచి శివ అనే పేరు పెట్టారు డైరెక్టర్ క్లాక్స్. కానీ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో తన పేరు శివ అని హీరో చెబితే వచ్చే కిక్ అంతగా లేకపోవటంతో... శివశంకర వరప్రసాద్ షో బిగిన్స్ అని డైలాగ్ రాశానని... అలా వచ్చిన ఐడియాతోనే క్యారెక్టర్ పేరును శివశంకర్ వరప్రసాద్ గా మార్చామని చెప్పారు కార్తికేయ.


Also Read : భోళా శంకర్ హిట్ అనలేను కానీ చిరంజీవి ఎవరెస్ట్ - మెగా ట్రోలింగ్‌పై కార్తికేయ


చిరంజీవికి వీరాభిమాని అయిన హీరో కార్తికేయ..గతంలో ఓ డ్యాన్స్ షో లో చిరంజీవి పాటలకు ఆయన ముందే నృత్యం చేసి ప్రశంసలు అందుకున్నారు. తన లైఫ్ లో ఇదే గొప్ప మూమెంట్ అని అప్పుడు కార్తికేయ చెప్పటంతో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. అంతలా చిరంజీవిపై ఉన్న అభిమానంతోనే తన సినిమాలో తన క్యారెక్టర్ కు చిరంజీవి అసలు పేరు పెట్టుకున్నాననంటూ చెప్పారు కార్తికేయ.


Also Read 'ప్రేమ్ కుమార్' రివ్యూ : పీటల మీద పెళ్లి ఆగితే? ఈసారైనా సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?


'బెదురులంక 2012' ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ట్రైలర్ రిలీజ్ చేశాక చూసిన రామ్ చరణ్... ట్రైలర్ చివర్లో వచ్చే శివశంకర ప్రసాద్ షో బిగిన్స్ అనే డైలాగ్ విని రామ్ చరణ్ సర్ ప్రైజ్ అయ్యారని చెప్పారు కార్తికేయ. ''రామ్ చరణ్ ట్రైలర్ మొత్తం చాలా ఎంజాయ్ చేశారు. చివర్లో చిరంజీవి గారి అసలు పేరు మీదుగా డైలాగ్ పెట్టడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆయనపై  ఉన్న అభిమానంతో నాన్న పేరు పెట్డడం బాగుందంటూ రామ్ చరణ్ ప్రశంసించారు'' అని ఏబీపీ దేశానికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో కార్తికేయ చెప్పారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఆయన రామ్మా చిలకమ్మా పాటలు విని డ్యాన్స్ నేర్చుకున్నానని..ఇప్పుడు ఆయన అసలు పేరును సినిమాలో పాత్రకు పెట్టుకోవటంతో పాటు..ఆ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేయటం చాలా సంతోషంగా ఉందని తన అభిమానాన్ని చాటుకున్నారు యంగ్ హీరో కార్తికేయ.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial