Karthi new movie update: కార్తీ తమిళ్ హీరో. కానీ, ఆయనకు తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా... అన్నయ్య కంటే ముందు తెలుగులో డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. తెలుగులో మాట్లాడటం స్టార్ట్ చేశారు. అందుకే, కార్తీ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు ఆయన తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు తెలిసింది. 

'మ్యాడ్' కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ!Mad fame Kalyan Shankar to direct Karthi: 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో విజయాలు అందుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఇప్పుడు అతని దర్శకత్వంలో కార్తీ సినిమా చేయనున్నారు. అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. 'మ్యాడ్ స్క్వేర్' తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా కళ్యాణ్ శంకర్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు కార్తీ సినిమా లైనులోకి వచ్చింది.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

తెలుగు దర్శకుడితో ఇంతకు ముందు సినిమా చేసిన అనుభవం కార్తీకి ఉంది. వంశీ పైడిపల్లితో 'ఊపిరి' చేశారు. అందులో నాగార్జునతో కలిసి నటించారు. ఆ మధ్య నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' చివరలో అతిథి పాత్రలో సందడి చేశారు. ఆ సినిమా దర్శకుడు శైలేష్ కొలనుతో 'హిట్ 4' చేయనున్నారు. దానికంటే ముందు కళ్యాణ్ శంకర్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. 'మ్యాడ్' సినిమాలో ఫన్ ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు కార్తీ సినిమా కూడా ఫుల్లుగా నవ్వించే కథతో తీసే అవకాశాలు ఉన్నాయట.

సూర్య నిర్మాతలతో కార్తీ సినిమా కూడా!?ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కార్తీ - కళ్యాణ్ శంకర్ సినిమాను సైతం వాళ్ళు నిర్మించే అవకాశాలు ఉన్నాయట. 

Also ReadViral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్