Karate Kalyani Shocking Comments on Lavanya: రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసు ఇప్పటికి సస్పెన్స్‌ గానే ఉంది. గత 15 రోజులుగా ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తుంది. ఇందులో ఎవరిది తప్పు.. ఎవరూ బాధితులో పోలీసుల సైతం తేల్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసులో మధ్యలోకి సినీ నటి కరాటే కళ్యాణ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. లావణ్యకు మద్దతుగా కరాటే కళ్యాణి ఆమెతో పాటు పలు ఇంటర్యూలుకు హాజరైంది. దీంతో అంతా ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. అంతేకాదు ఈ వ్యవహరంలో పోలీసులే కరాటే కళ్యాణిపై కేసు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. 


అంతేకాదు ఆడపిల్ల అయితే తప్పు ఎవరిదైనా సపోర్టు ఇస్తావా? అంటూ నెటిజన్లు కరాటే కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లావణ్యకు సపోర్టు ఇవ్వడంపై కరాటే కళ్యాణ్‌ స్వయంగా వివర ఇచ్చింది. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె లావణ్యపై షాకింగ్‌ కామెంట్స్ చేసింది. మొదట తాను లావణ్యకు సపోర్టు ఇవ్వడం నిజమేనని, కానీ చివరికి ఈ కేసులో తప్పు ఎవరిదో తెలియక సైలెంట్‌ అయ్యానంటూ ఊహించని కామెంట్స్‌ చేసింది. ఈ ఇంటర్య్వూలో కరాటే కళ్యాణికి లావణ్యకు సపోర్టు చేయడంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. తాను లావణ్యకు సపోర్టు చేయలేదని, ఆర్జే శేఖర్‌ భాషా పడుకుంది అనే వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించానంది.


లావణ్య మానసిక పరిస్థితి బాలేదు..


అమ్మాయి ఎలాంటిది అయినా బహిరంగంగా అలాంటి కామెంట్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు లావణ్యతో కలిసి ఇంటర్య్వూలో పాల్గొని చెప్పాను అని పేర్కొంది. ఇక ఈ కేసులో ఎవరిది తప్పు అనేది తెలియడం లేదు. ఇద్దరి సైడ్‌ తప్పు ఉంది. ఈ అమ్మాయి పూర్తిగా కరెక్ట్‌ అని చెప్పలేం. కానీ ఆమెను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఆమె మానసిక పరిస్థితి బాలేదనిపిస్తుంది. ఎవరైనా కేర్ తీసుకుని ఆమెను కన్సల్టేషన్‌ తీసుకోవడం కరెక్ట్‌ అనేది నా ఫీలింగ్‌. ఆమె ఆడియో కాల్స్‌ వినగానే నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఈ అమ్మాయి చాలా మారాలి. తన పద్దతి, బిహేవియర్ బాలేదు. ఇక ఇంటర్య్వూలో వారి ఆడియోస్‌ అన్ని విన్నాక చూస్తుంటే రాజ్‌ తరుణే అమాయకుడు అనిపిస్తుంది. ఇంత గొడవ అయ్యాక వారిద్దరు కలవరు. ఆ అమ్మాయికి కూడా అదే చెప్పాను. నీకు ఏం కావాలో ఒకసారి మాట్లాడుకుని సెటిల్‌మెంట్‌ చేసుకుంటే మంచిదని ఆమెకు చెప్పాను" అంటూ చెప్పుకొచ్చింది. 



లావణ్య చాలా తప్పులు చేసింది..


లావణ్యకు మద్దుతు ఇవ్వాలన్నా ఆమెకు సైడ్‌ కూడా చాలా తప్పులు ఉన్నాయి. అలా అని రాజ్‌ తరుణ్‌ సైడ్‌ తప్పులు లేవని అనను. ఇద్దరి సైడ్‌ తప్పులు ఉండోచ్చు. కానీ, లావణ్య అయితే చాలా తప్పులు చేసింది. ఏ విషయంలోనూ క్లారిటీగా చెప్పడం లేదు. మస్తాన్‌ సాయి మీద ఎఫ్‌ఐఆర్‌ పెట్టింది. కానీ అది పోలీసులు తనని మభ్యపెట్టి పెట్టారని, తాను సంతకం చేయలేదంటూ చెప్పింది. అప్పుడే నాకు ఇది కరెక్ట్‌గా లేదని అర్థమైంది. ఇంటర్య్వూలో ఆడియో రికార్డులు విని షాక్‌ అయ్యా. ఏం మాట్లాడాలో తెలియక చాలా సేపు సైలెంట్‌గా ఉన్నా. కానీ ఈ ఎపిసోడ్‌కి ఎప్పుడు శుభం కార్డు పడుతుందో తెలియదు కానీ, అదేదో త్వరగా జరిగితే బాగుండు అనిపిస్తుంది" అంటూ పేర్కొంది. 


Also Read: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ