సినీ తారలు ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.  ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలను నెటిజన్లతో పంచుకుంటారు. తమ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటారు. అయితే, ఒక్కోసారి నెటిజన్లు అడిగే తలతిక్క ప్రశ్నలు వాళ్లలో కోపం కట్టలు తెంచుకునేలా చేస్తుంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఓ నెటిజన్ పిచ్చి ప్రశ్నకు చెంప చెల్లుమనిపించే సమాధానం చెప్పారు.


కరణ్ జోహార్ చాలా కాలం తర్వాత మళ్లీ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు.  ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్  కొత్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ అయిన  ‘థ్రెడ్స్‌’లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ సందర్భంగా నెటిజన్లతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తన సినిమాలతో పాటు పర్సనల్ విషయాల గురించి స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన అడిగిన ప్రశ్న కరణ్ కు ఎక్కడో కాలేలా చేసింది. వెంటనే ఆయన దిమ్మతిరిగేలా సమాధానం చెప్పారు.


నెటిజన్ ప్రశ్నకు ఘాటు రిప్లై ఇచ్చిన కరణ్ జోహార్


నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్తున్న క్రమంలో ఓ నెటిజన్ తలతిక్క ప్రశ్న వేశాడు. ‘మీరు గే కదా, నిజమేనా?’ అని క్వశ్చన్ వేశాడు. వెంటనే కరణ్ జోహార్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ‘నీకు ఆసక్తిగా ఉందా?’ అంటూ కౌంటర్ విసిరారు. ఆయన సమాధానం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. సూపర్ రిప్లై ఇచ్చారంటూ ఆయనను మెచ్చుకుంటున్నారు. ఇక “మీ జీవితంలో బాధపడిన సందర్భం ఏదైనా ఉందా?” అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. “నాకు చాలా ఇష్టం అయిన నటి శ్రీదేవితో కలిసి పని చేయలేకపోవడం” అన్నారు.   


7 ఏండ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన కరణ్ జోహార్


ఇక కరణ్ జోహార్ ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ సినిమా తర్వాత మళ్లీ దర్శకుడిగా మారారు. సుమారు ఏడేండ్ల తర్వాత ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రణవీర్‌ సింగ్‌, అలియా భట్‌ హీరో, హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్‌ ఎంటర్ టైనర్ జులై 28న రిలీజ్ అవుతుంది.  ఇక ఆయన హోస్టుగా చేసిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో బాగా పాపులర్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఆయన  ‘లైగర్‌’, ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌ 1’, ‘సెల్ఫీ’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘యోధా’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది.  






Read Also: ‘జబర్దస్త్’ షో నుంచి తీసేస్తామని ముందే చెప్పారు: యాంకర్ రష్మీ


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial