Rishab Shetty's Kantara Chapter 1 Pre Release Event Full Details: కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార చాప్టర్ 1'. పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'కాంతార'కు ప్రీక్వెల్ కావడంతో సినిమాపై తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఫంక్షన్ ఎక్కడ చేస్తున్నారు? ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు? ఇంకా గెస్ట్స్ ఎవరు? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. 

Continues below advertisement

ముఖ్య అతిథిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్!NTR to grace Kantara Chapter 1 Pre Release Event: 'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారు. రిషబ్ శెట్టితో ఆయనకు మంచి స్నేహం మాత్రమే కాదు... రెండు కుటుంబాల మధ్య చక్కటి అనుబంధం ఉంది. ఆ మధ్య కర్ణాటకలో దేవాలయాలకు ఎన్టీఆర్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు రిషబ్ శెట్టి కుటుంబం తోడుగా ఉంది. అయితే ఈ హీరోలు ఇద్దరూ ఒకే వేదిక మీదకు వస్తుండటం ఇదే మొదటిసారి.

Also Read: రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' ట్రైలర్ రేపే... ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారంటే?

Continues below advertisement

మ్యాన్ ఆఫ్ మాసెస్ ముఖ్య అతిథిగా వస్తున్న 'కాంతార ఏ లెజెండ్' ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగు నిర్మాతలు సైతం సందడి చేయనున్నారు. నైజాంలో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. మైత్రి నుంచి రవిశంకర్ యలమంచిలి, శశి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 'కాంతార'ను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన అల్లు అరవింద్ వస్తారో? లేదో? మరి! 

'డ్రాగన్'లో రుక్మిణీ వసంత్ నటిస్తున్నట్టు చెబుతారా?'కాంతార చాప్టర్ 1'లో రుక్మిణీ వసంత్ హీరోయిన్. కనకవతి పాత్రలో ఆవిడ నటించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే... ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'డ్రాగన్'లోనూ రుక్మిణీ వసంత్ హీరోయిన్. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు తొలిసారి ఎన్టీఆర్, రుక్మిణి కలిసి ఓ వేదికపై కనిపించనున్నారు. మరి తనకు జంటగా రుక్మిణి నటిస్తున్న విషయాన్ని ఎన్టీఆర్ చెబుతారో? లేదో? వెయిట్ అండ్ సి.

'కాంతార' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు?Kantara Chapter 1 Pre Release Event Time Venue: హైదరాబాద్ సిటీలో జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో 'కాంతార' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వర్షాల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ ప్లాన్ చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఈవెంట్ చేయాలనేది ప్లాన్. స్టార్ట్ అయ్యేసరికి ఆరు గంటలు కావొచ్చు.

అక్టోబర్ 2న 'కాంతార చాప్టర్ 1' థియేటర్లలోకి రానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను 'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా హిట్స్ తీసిన హోంబలే ఫిలిమ్స్ తెరకెక్కించింది. దీనికి విజయ్ కిరగందూర్ నిర్మాత.

Also Read'హృదయపూర్వం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో మోహన్ లాల్ - The Raja Saab హీరోయిన్ మాళవికా మోహనన్ సినిమా