ప్రముఖ నటుడు కిశోర్ కుమార్ కు ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ట్విట్టర్ వేటు వేసింది. ఆయన ట్విట్టర్ ను చూసేందుకు ప్రయత్నించిన వారికి, “అకౌంట్ సస్పెండ్ అయ్యింది. ట్విట్టర్ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించిన వారి అకౌంట్ సస్పెండ్ అవుతుంది” అనే హెచ్చరిక కనిపిస్తోంది. అయితే, కిశోర్ కుమార్ ట్విట్టర్ రూల్స్ కు విరుద్ధంగా ఏం చేశారు? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయన చేసిన ఏ ట్వీట్స్ వివాదానికి కారణం అయ్యాయి? అనే విషయంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎంతకాలం ఈ సస్పెషన్ కొనసాగుతుంది? అనే విషయంపై ట్విట్టర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
‘కాంతార’ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా చేసిన కిశోర్ కుమార్
తాజాగా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నన కన్నడ సినిమా ‘కాంతార’లో కిశోర్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఫారెస్ట్ అధికారిగా నటించి మెప్పించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ సినిమా పరిశ్రమల్లోనే ఆయన పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. రకరకాల పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘షీ’ లాంటి వెబ్ సిరీస్ లతోనూ నటించారు.
అకౌంట్ సస్పెండ్ కు కారణం ఆ ట్వీటేనా?
సినిమాలతో పాటు రాజకీయాలు, సామాజిక అంశాల గురించి కూడా కిశోర్ యాక్టివ్ గా స్పందిస్తుంటారు. ఏ విషయం అయినా తన అభిప్రాయాలను సూటిగా సుత్తి లేకుండా చెప్తారు. తాజాగా ‘కాంతార’ దేవుడిని అవమానించిన ఓ వ్యక్తి చనిపోయాడనే వార్త బాగా ప్రచారం జరిగింది. దీనిపై కిశోర్ స్పందించారు. దేవుడు, దయ్యం అనేవి కేవలం నమ్మకం మాత్రమే అన్నారు. నమ్మితే ఉన్నట్లు, నమ్మకపోతే లేనట్లు అని చెప్పారు. కష్టకాలంలో ధైర్యాన్ని ఇచ్చే నమ్మకాలను అవమానించాల్సి అవసరం లేదన్నారు. అక్రమార్కులను శిక్షించేందుకు చట్టం ఉందన్నారు. విశ్వాసం కలిగి ఉండటంతో తప్పులేదు. కానీ, మూఢనమ్మకాలు మంచిది కాదని కిశోర్ వెల్లడించారు. మరోవైపు.. ఎన్డీటీవీని అదానీ గ్రూప్ కొనుగోలు చేయడాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ట్వీట్ కారణంగానే ఆయన అకౌంట్ సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.
కిశోర్ కుమార్ ట్విట్టర్ పునరుద్దరించాలని అభిమానుల డిమాండ్
అటు కిశోర్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ నిలిపివేయడం పట్ల ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతున్నారు. ఏకంగా ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో కిశోర్ అకౌంట్ తొలగింపు అంశం వైరల్ అవుతోంది. అయితే, ఆయన అకౌంట్ గురించి ట్విట్టర్ ఇప్పటి వరకు ఎలాంటి విరరణ ఇవ్వలేదు. కిశోర్ కుమార్ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ సహా పలు సోషల్ మీడియా అకౌంట్లను కలిగి ఉన్నారు. ఇన్‌స్టాలో 43 వేల మంది, ఫేస్‌బుక్‌లో 66 వేల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ ఉన్నారు.