మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'పెద్ది' (Peddi Movie). బాలీవుడ్ భామ, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. జూన్ 4న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. మెజారిటీ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే... ఈ ట్రైలర్ మీద కన్నడ కథానాయకుడు, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి ప్రశంసల వర్షం కురిపించారు. 

Continues below advertisement

'పెద్ది' ట్రైలర్... 'కాంతార' రిషబ్ రివ్యూ!'కాంతార'తో రిషబ్ శెట్టికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హిందీలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 'పెద్ది' ట్రైలర్ గురించి ఆయన చేసిన పోస్ట్ ప్రేక్షకులు అందరిలో ఆసక్తి పెంచింది.

'పెద్ది' ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌ షేర్ చేస్తూ... ''చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ రామ్ చరణ్ అబ్సల్యూట్ ఫైర్ చూపించారు. స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు. శివ రాజ్ కుమార్స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. పాత్రకు అవసరమైన గాంభీర్యాన్ని చూపించారు. జాన్వీ కపూర్ అందంగా ఉన్నారు. బుచ్చిబాబు బాగా చేశారు. ఎక్స్‌లెంట్ వర్క్'' అని రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు. ఆయనకు 'పెద్ది' చిత్ర బృందం థాంక్స్ చెప్పింది.

Continues below advertisement

Also Read: Ravi Mohan Wife Aarti Background Family Details - 'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?

'పెద్ది' కథ విషయానికి వస్తే... విజయనగరంలోని ఓ పల్లెలో క్రికెట్, కుస్తీ ఆడే యువకుడిగా రామ్ చరణ్ కనిపించారు. అలాగే పరుగు పందేల్లో కూడా అతను పాల్గొంటాడు. తమ ఊరి ప్రజల కోసం 'పెద్ది' ఏం చేశాడు? దేశం తరఫున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనటానికి ఎలా వెళ్ళాడు? అనేది సినిమా. జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్, బోమన్ ఇరానీ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

Also ReadKeneeshaa Francis - ఎవరీ కెనీషా? ఆర్తితో విడాకులకు కారణం ఈమేనా? జయం రవి గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ తెల్సా?

రిషబ్ శెట్టి చేస్తున్న సినిమాలకు వస్తే... తెలుగు దర్శకుడు, 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' చేస్తున్నారు. అందులో ఆయనది హనుమంతుని పాత్ర. ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్'లోనూ నటిస్తున్నారు.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?