Vishnu Manchu's Kannappa Second Day Box Office Collection: విష్ణు మంచు డ్రీమ్ మూవీ 'కన్నప్ప' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విష్ణు కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ వచ్చిన మూవీగా రికార్డు సృష్టించగా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రెండో రోజు మొత్తంగా కలిపి రూ.40 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫస్ట్ డేతో పోలిస్తే...
ఫస్డ్ డేతో పోలిస్తే రెండో రోజు హిందీ వెర్షన్‌లో 40 శాతం పెరుగుదల కనిపించింది. తొలి రోజు ఇండియావ్యాప్తంగా రూ.9.35 కోట్లు వసూళ్లు సాధించింది. తెలుగు వెర్షన్ ఒక్కటే రూ.8.25 కోట్లు వసూలు కాగా... తమిళం రూ.15 కోట్లు, హిందీ రూ.65 లక్షలు, కన్నడ రూ.10 లక్షలు, మలయాళం రూ.20 లక్షలు రాబట్టింది. ఇక రెండో రోజు కాస్త కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.
రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. అన్నీ భాషల్లో కలిపి రూ.16.35 కోట్ల నెట్ వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'కన్నప్ప'తో విష్ణు సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారని చెబుతున్నారు.
Also Read: కింగ్ నాగార్జున హోస్ట్... బిగ్ బాస్ సీజన్ 9 - హౌస్‌లోకి మీరూ వెళ్లొచ్చు తెలుసా... ఎలాగంటే?
సెలబ్రిటీల ప్రశంసలు
'కన్నప్ప' మూవీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. తిన్నడిగా విష్ణు మంచు యాక్టింగ్ అదరగొట్టారని రివ్యూ ఇచ్చారు. తాజాగా... సంచలన దర్శకుడు ఆర్జీవీ సైతం విష్ణు యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు. దీనిపై రియాక్ట్ అయిన విష్ణు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. బాక్సాఫీస్ వసూళ్లు పట్ల విష్ణుతో పాటు మూవీ టీం సంతోషం వ్యక్తం చేసింది. నటుడిగా తన విజిటింగ్ కార్డు 'కన్నప్ప' అని విష్ణు అన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి ప్రశంసలు వచ్చినట్లు చెప్పారు. ఓ సినిమా నిజాయతీగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ప్రభాస్ కారణంగానే తమ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పారు.
ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా... తిన్నడిగా విష్ణు అదరగొట్టారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మహదేవశాస్త్రిగా మోహన్ బాబు, కిరాతగా మోహన్ లాల్, రుద్రుడిగా ప్రభాస్, శివునిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, సప్తగిరి, బ్రహ్మాజీ, శివ బాలాజీ, రఘుబాబు, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు మూవీని నిర్మించారు.
చిన్నప్పటి నుంచి నాస్తికుడిగా ఉన్న తిన్నడు పరమ శివుని భక్తునిగా ఎలా మారాడు? శ్రీకాళహస్తీశ్వర క్షేత్ర మహత్యం ప్రధానాంశంగా మూవీని తెరకెక్కించారు. విష్ణు కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా 'కన్నప్ప' నిలవనుంది. పైరసీని అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని విష్ణు తెలిపారు. పైరసీని ఎంకరేజ్ చెయ్యొద్దని ప్రేక్షకులను కోరారు.