Kanguva Trailer Decoded: ఈ ఏడాదిలో కోలీవుడ్ నుంచి పలు ప్యాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఎక్కువమంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు అంచనాలు పెంచేసింది సూర్య హీరోగా నటించిన ‘కంగువా’. ఈ మూవీ పలుమార్లు పోస్ట్‌పోన్ అయ్యి ఫైనల్‌గా అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. విడుదల తేదీకి ఇంకా సమయం ఉన్నా అప్పుడే మూవీ ట్రైలర్‌ను విడుదల చేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్‌ను చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయని ప్రేక్షకులు అంటున్నారు. అంతే కాకుండా ఇందులో కొన్ని డీటైల్స్‌ను వారు డీకోడ్ చేశారు.
వారితో యుద్ధం..
‘కంగువా’ ట్రైలర్ మొత్తం అడవిలో నివసించే గిరిజనుల చుట్టూనే తిరుగుతుంది. కానీ సరిగా గమనించి చూస్తే వారంతా స్పార్టన్లు అని అర్థమవుతోంది. 431 – 404 BC కాలంలో గ్రీస్‌కు చెందిన ఆర్మీని స్పార్టన్లు అంటారు. ‘కంగువా’ ట్రైలర్‌లోని ఒక షాట్‌లో స్పార్టన్ల వారియర్ ఆర్మర్ ధరించిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. దీన్ని బట్టి చూస్తే ఇది అప్పట్లో స్పార్టన్లు, గిరిజనులు మధ్య జరిగిన యుద్ధాల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని అర్థమవుతోంది. మూవీ కథ మొత్తం దాదాపుగా వీరి చుట్టూనే తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘కంగువా’ ట్రైలర్‌లో కనిపించిన స్పార్టన్ల నౌకలు, అప్పట్లో వారు ఉపయోగించిన నాణేలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది.
కదలని జనం..
‘కంగువా’ ట్రైలర్‌ను బట్టి చూస్తే మూవీలో రెండు తెగల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయని తెలుస్తోంది. అందులో ఒక తెగకు సూర్య నాయకుడు కాగా.. మరొక తెగకు బాబీ డియోల్ నాయకుడు. అప్పట్లో గిరిజనులు చాలా బలంగా ఉండేవారు. శారీరికంగా వారు ఎలాంటి నొప్పిని అయినా తట్టుకుంటారు. అదే విషయాన్ని ట్రైలర్‌లో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు దర్శకుడు శివ. అగ్ని పర్వతం బద్దలయ్యి లావా పొంగి వస్తున్నా కూడా ప్రజలు కదలకుండా అలాగే నిలబడి ఉంటారు. వారంతా దయ లేకుండా కొందరు స్పార్టన్ల చేతులు నరికేసి సముద్రంలో పడేసి రక్తపాతం సృష్టించడం కూడా ట్రైలర్‌లో చూపించారు. ఇందులో ఎక్కువగా అడవి, ఎత్తైన ప్రదేశాలు మాత్రమే ఉన్నాయి.
కార్తి ఉన్నాడా?
ట్రైలర్‌లోని ఒక షాట్‌లో బాబీ డియోల్ ఒక వ్యక్తిని చంపి ఆ కొండపై నుంచి తోసేసి చంపేసినట్టుగా చూపించారు. కానీ అది ఎవరు అని చూపించలేదు. బాణానికి పామును చుట్టి వదలడం, మండుతున్న గోళాలు విసరడం లాంటి షాట్స్ చూస్తుంటే ‘కంగువా’లో వయొలెన్స్ చాలానే ఉండబోతుందని అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో ఒక వ్యక్తి గుర్రంపై రావడాన్ని చూపించారు. అది ఎవరో సరిగా కనిపించకపోయినా.. అక్కడ ఉన్నది కార్తి అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. ‘కంగువా’ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. అందులోని మొదటి భాగంలో కార్తి గెస్ట్ రోల్‌లో కనిపించి, రెండో భాగంలో పూర్తిస్థాయి విలన్‌గా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: కంగువ ట్రైలర్... బాహుబలి రేంజ్‌లో సూర్య సినిమా - యాక్షన్, విజువల్స్ కుమ్మేశాయి!